ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కన్నడ ప్రజలు ఎందుకు లైట్ తీసుకున్నారు..? కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని ఇండియన్ సినీ జనాలు మాట్లాడుకుంటున్న సలార్ సినిమా కర్ణాటకలో ఎందుకు చతికల్పడింది..? సలార్ సూపర్ హిట్ అనటంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. నార్త్ సినిమా మాఫియాను బద్దలు కొట్టిన మరోచరిత్ర. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కేవలం మూడు రోజుల్లో ఈ సినిమా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. మనదేశంలోనే కాకుండా ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది.
సలార్ ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే రూ.70 కోట్లు రాబట్టినట్టు చెబుతున్నారు. మూడు రోజుల్లో తెలుగులోనే రూ.137 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. మలయాళంలో రూ.7 కోట్లు, తమిళంలో రూ.10 కోట్లు, హిందీలో రూ.53 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. హిందీలో రూ.53 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయితే కర్ణాటకలో మూడో రోజులకు కలిపి కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఎందుకిలా అనే ప్రశ్నకు నిజానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదని చెప్పాలి.
ప్రభాస్ ను కన్నడ జనాలు అంగీకరించలేదా.. అంటే అలాంటిదేమీ లేదు. తన సాహూ, బాహుబలి సినిమాలు కన్నడ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. పైగా ఈ సినిమా నిర్మాత ,దర్శకుడు అందరూ కన్నడ వాళ్లే. సినిమాకు పని చేసిన వాళ్లంతా కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. అయితే సలార్ మాతృక ఉగ్రం సినిమా చూశాం కదా.. అది జస్ట్ రీమిక్ కదా అనుకున్నారేమో అన్నది ఆ కాటేరమ్మకే తెలియాలి. ఏది ఏమైనా కన్నడంలో సలార్ అంచనాలు అందుకోలేదు అన్నది వాస్తవం.