భారీ అంచనాలతో వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఓవర్సీస్‌లో ఇప్పటికే 7 మిలియన్ డాలర్లు దాటేసి.. 10 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. సలార్ సినిమాకు పోటీగా వచ్చిన షారుఖ్ ఖాన్ ఢంకీ సినిమా ఇప్పటివరకు ఇండియాలో కేవలం రూ.140 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మరో రూ.50 కోట్ల వసూళ్లు రావాలి.
లేకపోతే ఢంకీ సినిమా ప్లాప్ అయినట్టే. సలార్ సినిమా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో సూపర్ డూపర్ హిట్. అదే టైం లో కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈ సినిమా నిలదొక్కుకొలేకపోయింది. క్రిస్మస్ ముగిసిన వెంటనే ఈ సినిమా కలెక్షన్ల పరంగా దాదాపు 50 శాతం డ్రాప్ అయ్యింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సలార్ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌కు వస్తున్న వసూళ్లకు అస్సలు పొంతన ఉండటం లేదు. స్వయంగా హోంబాలే సంస్థ సలార్ సినిమాతో కర్ణాటకలో భారీ నష్టాలు చూడటం గ్యారంటీ అని తేలిపోయింది.
కర్ణాటకలో ఇప్పటివరకు రూ.5 కోట్ల షేర్ కూడా రాలేదని తెలుస్తోంది. సలార్ సినిమాను కర్ణాటక ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. కేరళలో పృథ్వీరాజ్ ఉండడంతో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు చెప్పలేని పరిస్థితి. ఇక తమిళనాడులో మాత్రం సలార్ బ్రేక్ ఈవెన్ అందుకోవటం అసాధ్యం అని తేలిపోయింది. ఏది ఏమైనా కర్ణాటక, తమిళనాడులో సలార్ పెద్ద డిజాస్టర్ అయినట్టే అనుకోవాలి.