ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఉన్న యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా ఈ నెల 22న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ ట్రైలర్ వచ్చింది… అంచనాలు అందుకోలేదు. త్వరలోనే రెండో ట్రైలర్ కూడా రావచ్చని టాక్ వచ్చింది. ఇక సాంగ్ కూడా రాబోతోంది. డిసెంబర్ 22న లేదా 21 అర్ధరాత్రి దాటిన వెంటనే సలార్ ఫస్ట్ షో చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షలాది మంది సినీ అభిమానులు ఎంత ఆత్రుతతో ఉన్నారో చెప్పక్కర్లేదు.
అయితే ఈ సినిమాపై ఉన్న బజ్, డిమాండ్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకుని మరీ భారీగా టిక్కెట్ రేట్లు పెంచేస్తారని అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్ల మీద రు. 100 అదనంగా పెంచి అమ్ముతారంటున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ మల్టీప్లెక్స్ ల్లో 330 నుంచి 400 వరకు ఒక్కో టిక్కెట్ అమ్ముడు కానుంది.
సింగిల్ స్క్రీన్లలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేటుకు అదనంగా మరో 30 రూపాయలు అదనంగా పెంచుతారంటున్నారు. నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఏకంగా ఆరు షోల పర్మిషన్ కూడా మైత్రీ వాళ్లు గట్టిగా ట్రైల్స్ చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్లపై కూడా రు. 100 అదనంగా ఉండనుంది.
రు. 295 ఉండే రిక్లెయినర్లు ఇప్పుడు రు. 395 కానున్నాయి. కొన్ని చోట్ల రు. 450 టిక్కెట్ రేటు ఉండనుంది. అయితే ఉదయం వేసే ప్రీమియర్ షోల టిక్కెట్ రేట్లు రు. 500 నుంచి వెయ్యి వరకు పలుకుతున్నాయి. ఏదేమైనా టిక్కెట్ రేట్లు ఇంత ఎక్కువుగా ఉండడంతో సినీ ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ విషయంలో మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారో ? చూడాలి.