Newsబుక్ మై షోలో ' స‌లార్ ' ర్యాంపేజ్‌.. ప్ర‌భాస్ సెన్షేష‌న‌ల్...

బుక్ మై షోలో ‘ స‌లార్ ‘ ర్యాంపేజ్‌.. ప్ర‌భాస్ సెన్షేష‌న‌ల్ రికార్డ్‌…!

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై.. ప్రముఖ కన్నడ నిర్మాత విజయ్ కిరంగ‌దూర్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఈనెల 22న దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏకంగా తారాస్థాయిలో ఉన్నాయి.

ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ తో పాటు ఆన్లైన్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో లో స‌లార్‌ ర్యాంపేజ్‌ ఆడుతోంది. ఇప్పటికే ఏకంగా వన్ మిలియన్ ఇంట్రెస్ట్‌లను సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్‌కు మరో ఐదు రోజుల టైం ఉంది. ఇప్పటికే సలార్ పై ఈ రేంజ్‌లో బ‌జ్ ఉందంటే సలార్ కోసం ఇండియన్ సినీ లవర్స్ ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారో తెలుస్తోంది.

ఈ విషయాన్ని సలార్‌ మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రభాస్ నటించిన రామాయణ ఇతిహాసం సినిమా ఆదిపురుష్‌ కూడా ఇదే పోర్టల్‌లో వన్ మిలియన్ పైగా ఇంట్రెస్ట్‌లు సొంతం చేసుకుంది. ఇక సలార్‌లో ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మలయాళ సీనియర్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news