ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా మన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్. ఈ భారీ పాన్ ఇండియా సినిమా కోసం జనాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మెప్పించిన ప్రభాస్ ఆరు నెలల గ్యాప్‌తో మరోసారి సలార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర డైనోసార్‌గా గర్జించనున్నాడు.
కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో పాపులర్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ యాక్షన్ డ్రామా పై ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా.. అటు కన్నడం.. ఇటు తమిళంతో పాటు నార్త్ బెల్ట్‌లో కూడా మంచి హైప్ నెలకొంది. సలార్ సినిమాకు పోటీగా షారుక్ ఖాన్ ఢంకీ సినిమా రిలీజ్ అవుతున్న కూడా.. సలార్ హిందీ బిజినెస్ ఒక రేంజ్‌లో జరిగింది. ఈ సినిమా హిందీ బిజినెస్ ఎంత ?జరిగింది.. నార్త్ మార్కెట్లో ఎంత రాబడితే ? సలార్ సేఫ్ అవుతుంది అన్న దానిపై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
సలార్ సినిమా నార్త్ మార్కెట్లో రూ.200 కోట్లకు పైగా షేర్ రాబడితేనే సేఫ్ జోన్ లోకి వెళుతుందని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద టార్గెట్. ఒక్క బాలీవుడ్ లోనే రూ.200 కోట్ల షేర్ అంటే కనీసం రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి. ఇక ఈ సినిమా హిందీ వసూళ్లపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ సిరీస్ సినిమాలు నార్త్ బెల్ట్ లో అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టాయి. ఆ రేంజ్‌లో సలార్‌కు వసూళ్లు వస్తే ప్రభాస్ కు బాలీవుడ్‌లో అదిరిపోయే హిట్ పడినట్టే అనుకోవాలి.