టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్. కే జి ఎఫ్ సిరీస్ సినిమాలతో పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని అందరూ ఒకటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
సలార్ సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవడం తో పాటు.. మొత్తం 176 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి దిగుతోంది. ఇప్పటికే విదేశాలలో కొన్నిచోట్ల సెన్సార్ షోలు కంప్లీట్ అయ్యాయి. దుబాయ్ సెన్సార్ టాక్ ప్రకారం సలార్ సినిమా చాలా బాగా వచ్చింది అని తెలుస్తోంది. మొత్తం సినిమాలో ఐదు పైట్లు ఉంటాయట. ఇంటర్వెల్‌కు ముందు రెండు.. ఆ తర్వాత మూడు.. అన్ని ఫైట్లు ప్రభాస్ మీదే. ఈ ఫైట్లు అన్ని ఒకదానిని మించి మరొకటి ఉంటాయంటున్నారు.
అయితే సినిమా ఫస్ట్ ఆఫ్ అదిరిపోయిందని.. సెకండ్ హాఫ్ అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గినట్టు ఉన్నా.. మళ్లీ ఫ్రీ క్లైమాక్స్‌లో పుంజుకుని క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో కొన్ని కంప్లైంట్‌లు ఉన్నా.. అవి సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపవని అంటున్నారు. ఇక ప్రభాస్ ఎంట్రీ సినిమాలో కొద్ది నిమిషాలు ఆలస్యంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభాస్ ఎంట్రీ ముందు వరకు కూడా ప్రభాస్ గురించి ఒక రేంజ్‌లో ఎలివేషన్లు ఉంటాయట.
సినిమా చూసిన వారందరూ బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఇలాంటి సినిమా కథ పడాల్సిందే.. అని అనుకునేలా సలార్ ఉందని చెబుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్.. ఉగ్రం సినిమానే మళ్లీ అటూ ఇటూ తిప్పి తీస్తున్నారని టాక్ ఉంది. ఎక్కడో చిన్న చిన్న పాయింట్లు కనెక్ట్ అయ్యాయి.. కానీ సలార్ మొత్తం వేరే కథ అని సినిమా చూసిన సెన్సార్ వాళ్ళు చెబుతున్నారు. ఇక పబ్లిసిటీ లేకుండా సలార్‌ను రిలీజ్ చేయటం అన్నది నిర్మాతల ప్లాన్ అని.. సినిమాను ఏమాత్రం తక్కువ అంచనా వేయక్కర్లేదని ట్రేడ్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి.