Movies' స‌లార్ ' ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌... వామ్మో...

‘ స‌లార్ ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌… వామ్మో ప్ర‌భాస్ ఏందీ అరాచ‌కం…!

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్‌, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మాసీవ్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స‌లార్‌. భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సెన్షేష‌న‌ల్ మూవీ పూర్తిస్థాయి బుకింగ్స్‌తో అద‌ర‌గొట్టేసింది. కేవ‌లం ఏపీ, తెలంగాణ‌లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌తో పాటు అటు నార్త్‌లోనూ ఫ‌స్ట్ డే రికార్డు స్థాయి బుకింగ్స్‌తో పాటు రికార్డు స్థాయి వ‌సూళ్ల‌తో వీరంగం ఆడేసింది.

ఈ యేడాది ఇండియ‌న్ సినిమాల్లో ఫ‌స్ట్ డై హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా చాలా సినిమాలు వ‌చ్చాయి. లియో, జ‌వాన్ సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు స‌లార్ ఆ సినిమాల‌ను కూడా దాటేసి ఫ‌స్ట్ డే ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన‌ట్టు తెలుస్తోంది. సలార్ సినిమాకి మొద‌టి రోజు 165 కోట్లకి పైగా గ్రాస్ వరల్డ్ వైడ్ గా వచ్చినట్టుగా చెప్తున్నారు.

దీనిపై పూర్తి స‌మాచారంతో పాటు ఏరియాల వారీగా వసూళ్లు రావాల్సి ఉంది. ఏదేమైనా ప్ర‌భాస్ రాజు అరాచ‌కం ఈ స్థాయిలో ఉండ‌డంతో టాలీవుడ్ మాత్ర‌మే కాదు.. ఇండియ‌న్ బాక్సాఫీస్ అంతా షేక్ అయిపోతోంది. లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా వ‌సూళ్లు అంచ‌నాల‌కు మించి ఉంటాయ‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news