టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా సలార్. కనీవినీ ఎరుగని అంచనాలతో శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సలార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే టాక్ వచ్చింది. తొలిరోజే సలార్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేసిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన సలార్ కి వచ్చిన టాక్ చూస్తుంటే చాలా సులువుగా రూ.1000 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా అన్ని భాషల్లో కలిపి తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా రూ.85 కోట్లు కొల్లగొట్టింది. ఇది మామూలు సెన్సేషన్ కాదని చెప్పాలి. అయితే సలార్ ఈ విషయంలో విజయ్ నటించిన లియో సినిమా రికార్డ్‌ను మాత్రం దాటలేదు. లియో సినిమా రిలీజ్ కి ముందే రు. 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి.
ముందుగా సలార్‌కు వచ్చిన హైప్ చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులలో లియోను దాటేస్తుందని అందరూ అంచనా వేశారు.
అయితే సలార్ సినిమాకు తెలుగు భాషలో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినా.. ఓవర్సీస్ ఇతర భాషల్లో అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. అందుకే సలార్ రూ.85 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే ఆగిపోయింది. దీంతో 2023లో ఓపెనింగ్ డే రూ.100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అందుకున్న సినిమాగా లియో రికార్డుల్లో నిలిచిపోయింది .