Movies' స‌లార్ ' ట్రైల‌ర్‌.... నిజంగానే బిల్డ‌ప్ ఎక్కువ‌... మ్యాట‌ర్ త‌క్కువ...

‘ స‌లార్ ‘ ట్రైల‌ర్‌…. నిజంగానే బిల్డ‌ప్ ఎక్కువ‌… మ్యాట‌ర్ త‌క్కువ ( వీడియో)

మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ అనుకోవచ్చు.. ఈరోజు విడుదలైన స‌లార్ ట్రైలర్‌ను..! కేజీఎఫ్‌తో నేషనల్ వైడ్‌ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌… వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో నేష‌న‌ల్‌ స్టార్ అయిపోయిన ప్రభాస్ కాంబినేషన్.. పైగా పృథ్విరాజ్ లాంటి మంచి స్టార్ ఉన్న నటుడు. ఇవన్నీ కలిసి సలార్ మీద అంచనాలు పెంచుతూ పోయాయి. అసలే కేజిఎఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇటు బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు.

ఇలాంటి కాంబినేషన్లో వస్తున్నా సలార్ సినిమా టీజర్ బయటికి వచ్చినప్పటి నుంచి అంచనాలు మామూలుగా లేవు. రోజురోజుకు బాగా పెరిగిపోయాయి. క్రిస్మస్ కానుకగా ఈనెల 22న విడుదలవుతున్న సినిమా ట్రైలర్. ఎలా ఉంటుందో అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది. సలార్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ప్రభాస్ అభిమానులకు మాస్ అభిమానులకు ట్రైలర్ బాగా నచ్చి ఉండొచ్చు.. కానీ ఓవరాల్ గా చూస్తే ప్రభాస్ యాక్షన్ సీన్లు అంతా సంతృప్తికరంగా లేవు.

ఇక ఈ ట్రైలర్ మొత్తం మీద కేజిఎఫ్ ప్రభావం బాగా కనిపించింది. సినిమా కలర్ టోన్ దగ్గర నుంచి.. గెటప్పులు, వాయిస్ ఓవర్లు పాత్రల పేర్లు ఇలా అడుగడుగునా కేజిఎఫ్ సినిమానే గుర్తుకు తెచ్చాయి. ఆఖరికి సీజీ వర్క్‌ మొత్తం కేజిఎఫ్ సినిమానే గుర్తుకు తెచ్చింది. ఇలాంటి ట్రైలర్లో మంచి ఎమోషనల్ స్టార్ట్ ఒకటైన ఉండాలి. హీరో గురించి స్నేహితుడు అంత బిల్డప్ ఇచ్చినప్పుడు.. ప్రభాస్ ఎంట్రీ సీన్ హై రేంజ్ లో ఉండాలి. అలాంటిదేమీ కనిపించలేదు.

ప్రభాస్ మీద సరైన యాక్షన్ సీన్లు కట్ చేయకుండా మంచి పవర్ఫుల్ డైలాగులు కూడా లేకుండా ట్రైలర్ కట్ చేశారు. అన్నిటికీ మించి మూడు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్లో సగం ట్రైలర్ దాటే వరకు హీరోను చూపించకుండా.. ట్రైలర్ కట్ చేయడం కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఏది ఏమైనా సలార్‌ ట్రైలర్లో బిల్డప్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువ.. అన్నట్టుగా ఉంది. మరి రేపు సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news