ఓల్డ్ యాక్టర్.. పైగా హాస్య బ్రహ్మ.. రేలంగి వెంకట్రామయ్య.. అనేక సినిమాల్లో నటించారు. నిజానికి ఆయన ఏ పాత్ర వేసినా.. ఏ యాక్షన్ చేసినా.. దానిలో హాస్యం తొణికిసలాడుతుంది. సీరియస్ పాత్రలు చేసినా.. కూడా వాటిలోనూ నవ్వులు పూయించేవారు. తెలుగు, తమిళ భాషల్లో వందల సినిమాల్లో రేలంగి నటించా రు. అయితే.. ఆయన అత్యంత జాగ్రత్తపరుడు. ప్రతి రూపాయిని ఆచి తూచి ఖర్చు చేసేవారు.
అప్రమత్తంగా లేకపోతే.. అభాసుపాలవుతామనే సూత్రాన్ని పాటించారు. అదేసమయంలో ఖర్చు చేయాల్సిన చోట వెనుకాడేవారు కాదు. కొత్త కారు వస్తే.. కొని తీరాల్సిందే. పేద్ద బంగళా కూడా కట్టించారు. అందులో ఏకంగా 10 విజిటర్స్ లేదా గెస్టుల కోసం కేటాయించారు. తనను చూసేందుకు బంధువులు.. ఇతరత్రా అబిమానులు వస్తే.. కనీసం రెండు రోజులైనా వారిని వదిలి పెట్టేవారు కాదు.
ఒక రోజు ఉండి వెళ్తామంటే.. ఆ మాత్రానికి ఎందుకు రావడం అని మొహం మీదే అనేసేవారట. అంతే కాదు.. ఇంట్లో ఎప్పుడూ రెండు కార్లు సిద్ధంగా ఉంచుకునేవారట. తాను షూటింగులకు వెళ్లిపోయినా.. అతిథులకు ఆయన ఎక్కడా మర్యాద తగ్గకుండా చూసుకునేందుకు.. ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి నుంచి ఎవరైనా వస్తే.. వారిని ప్రత్యేకంగా మద్రాస్ అంతా తిప్పి.. నగరం విశేషాలను చెప్పించేవారట.
దీంతో రేలంగి ఆతిథ్యం అంటే.. రోజుల తరబడి చెప్పుకొనేవారట. దీంతో జిల్లాల నుంచి ఆయనను చూసేందుకు వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరిగిందని అనేవారు. అయితే.. రేలంగి ఎప్పుడూ ఏమనేవారు కాదు. తర్వాత.. ఆయన అనారోగ్యంతో సొంత ఊరుకే వచ్చి ఉన్నారు. తన కుటుంబం.. రైతుల సమక్షంలో నే ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు చెప్పేవారు.