సలార్ .. సలార్ .. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తూ మారుమ్రోపోతుంది . మరీ ముఖ్యంగా సినిమా ఎవరు ఊహించిన దాని కంటే ట్రిపుల్ స్థాయిలో హిట్ అవ్వడంతో బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంది. కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండోరోజు కూడా 150 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసేసింది . అయితే ఈ సినిమాలో శ్రీయా రెడ్డి పాత్రలో మొదటగా స్టార్ హీరో కూతుర్ని అనుకున్నారట ప్రశాంత్ నీల్.
ప్రభాస్ కి యాంటీ రోల్ ల్లో కనిపించే శ్రియా రెడ్డి పాత్ర కోసం ముందుగా వరలక్ష్మి శరత్ కుమార్ ను అప్రోచ్ అయ్యారట . కానీ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . అంతేకాదు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాల్లో నటిస్తే క్రేజ్ మొత్తం ప్రభాస్ కి వెళ్ళిపోతుంది తప్పిస్తే జనాలు పక్కన ఉండే రోల్స్ ని పట్టించుకోరు అని .. పైగా జగపతిబాబు – పృథ్వీరాజ్ లాంటి స్టార్స్ ఉన్నప్పుడు తన రోల్ ని ఎవరు పట్టించుకుంటారు అన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్ తో ఈ పాత్రను మిస్ చేసుకుందట .
కానీ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత చాలా బాధపడిపోయిందట , ఆ పాత్ర చేసుంటే బాగుండేదేమో అంటూ అనుకునిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తానికి శ్రియా రెడ్డి లక్కి ఛాన్స్ కొట్టేసింది. వరలక్షి ఈ పాత్ర చేసుంటే మాత్రం కెవ్వు కేక అనే చెప్పాలి. మంచి రోల్ ని మూర్ఖత్వం కారణంగా మిస్ అయిపోయింది..పాపం ఏం చేద్దాం..!?