సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏ హీరో కూడా ఆ హీరో కోసం రాసుకున్న కథను ఓకే చేయడం లేదు . కాల్ షీట్స్ లేకపోవడం ..లేకపోతే వేరే పనుల్లో బిజీగా ఉండడం .. లేదంటే కథ నచ్చకపోవడం . రీజన్స్ ఏదైనా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ట్రెండు ముందుకెళ్తుంది. ఒకవేళ ఆ సినిమా తాము చేయకపోతే తమ ఫ్రెండ్ కి ప్రమోట్ చేస్తున్నారు హీరోలు .
తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు నితిన్ . ఎక్స్ట్రాటనరీ మ్యాన్ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . వక్కంత వంశీ తనదైన స్టైల్ లో సీన్స్ కథలు రాసుకొని కామెడీతో అలరించాడు. అయితే ఈ కథలో ముందుగా రామ్ చరణ్ కు వినిపించాడట . వక్కంతం వంశీ కామెడీ టైమింగ్ బాగా సెట్ అవుతుంది చరణ్ కి అంటూ వినిపించగా ..
ఆయన రిజెక్ట్ చేశారట . పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్నాక ఇలా కామెడీ జోనర్ లో నటిస్తే జనాలు లైక్ చేయరు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారట . అంతేకాదు ఈ కథకు నితిన్ సూట్ అవుతాడు అని ..కాల్ చేసి మరి స్పాట్లోనే రప్పించి కథను వినిపించి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించారట . మెగా ఫ్యామిలీకి నితిన్ ఎంత క్లోజ్ అనేది మనకు బాగా తెలుసు, ఆ కారణంగానే చరణ్ ఇలా చేశాడు అంటున్నారు అభిమానులు..!!