బొమ్మరిల్లు .. ఈ సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు అవుతున్న సరే ఇప్పటికీ జనాలలో ఫ్రెష్ ఫీలింగ్ కలగజేస్తూ ఉంటుంది. టీవీలో ఈ సినిమా వచ్చిన ప్రతిసారి ఇంటిళ్లపాది కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ సినిమా ద్వారానే భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయారు . ఈ సినిమా సిద్ధార్ధ్ కు హీరోయిన్ జెనీలియా కు మంచి అవకాశాలు తెచ్చి పెట్టింది .
ఇప్పటికి వాళ్ళ పేర్లు జనాలలో నానుతున్నాయి అంటే దానికి కారణం బొమ్మరిల్లు సినిమా అని చెప్పక తప్పదు . దిల్ రాజు ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయినప్పుడు .. ఈ కథలో హీరోలుగా అల్లు అర్జున్ – ఎన్టీఆర్ లాంటి హీరోలను అనుకున్నారట . కానీ ఇద్దరు హీరోలకి ఈ కథ చెప్పగా రిజెక్ట్ చేశారట . వాళ్లకి ఈ సినిమాలో ఒక్క సీన్ నచ్చలేదట. అయితే ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని హీరో సిద్ధార్ధ్ కు ఈ కథను వివరించగా ..
ఆయన సెకండ్ కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం … చకచకా ఆయన ఓకే చేయడం జరిగిపోయాయి. అలా ఈ సూపర్ హిట్ సినిమా ఎన్టీఆర్ అల్లు అర్జున్ లో చేతికి వెళ్లిన చేయలేకపోవడంతో సిద్ధార్ధ్ చేతికి వచ్చి సూపర్ హిట్గా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత సిద్ధార్ధ్ లైఫ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాలా..?