Moviesరాజ‌మౌళి ప్ర‌భాస్ చేతికి క‌త్తి ఇచ్చాడు.. ప్ర‌శాంత్ నీల్ ఆ క‌త్తికి...

రాజ‌మౌళి ప్ర‌భాస్ చేతికి క‌త్తి ఇచ్చాడు.. ప్ర‌శాంత్ నీల్ ఆ క‌త్తికి శ‌క్తి ఇచ్చాడు..!

గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్న సలార్ సినిమా గత అర్ధరాత్రి నుంచి డైనోసార్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర గర్జిస్తోంది. ప్రభాస్, కేజిఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సలార్‌కు అదిరిపోయే టాక్ వచ్చేసింది. కనీ విని ఎరుగని రేంజ్‌లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. మిడ్ నైట్ షోలు అలా పూర్తయ్యాయో లేదో సోషల్ మీడియాలో సలార్ అదిరిపోయింది అన్న టాక్ హోరెత్తుతోంది. బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయాడు.

ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే.. సౌత్ ఇండియన్ హీరోలు మాత్రమే కాదు.. నార్త్ ఇండియాలో బడా బడా హీరోలు సైతం వణుకుతున్న పరిస్థితి. బాహుబలి సినిమాతో అంతటి క్రేజ్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే మన టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ చేతికి కత్తి ఇచ్చాడు.. బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఇప్పుడు మన తెలుగువాడే అయినా కన్నడ ఇండస్ట్రీలో స్థిరపడిన ప్రశాంత నీల్ ఆ కత్తికి శక్తి ఇచ్చాడు.

స‌లార్‌ సినిమాతో ప్రభాస్ రేంజ్, క్రేజ్ ఎప్పటికీ నేషనల్ స్థాయిలో ఉంటుందని సలార్ సినిమాతో చాటి చెప్పాడు. ఇంకా చెప్పాలి అంటే సలార్ సినిమాకు వచ్చిన టాక్ చూస్తుంటే రాజమౌళి గత సూపర్ డూపర్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులు కూడా చెల్లాచెదురు అయిపోతాయని అంటున్నారు. కే జి ఎఫ్ 2 రికార్డులు కూడా సలార్ బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా బాక్సాఫీస్ దగ్గర సలార్ వసూళ్ల విధ్వంసం ఎలా ? ఉంటుందో చూడటం ఒక్కటే మిగిలి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news