Newsఆ టాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్‌కు ఆశ‌ప‌డ్డ ప్రియ‌మ‌ణి... నీకు అంత...

ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్‌కు ఆశ‌ప‌డ్డ ప్రియ‌మ‌ణి… నీకు అంత లేదు దాంతో స‌రిపెట్టుకోమ‌న్నారా..!

ప్రియమణి..నేషనల్ అవార్డ్ విన్నర్. తెలుగులో ఎవరే అతగాడు మొదటి సినిమా. ఇది డిజాస్టర్. ఆ తర్వాత జగపతి బాబుతో పెళ్ళైన కొత్తలో సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో పరుత్తి వీరన్ ప్రియమణికి జాతీయ ఉత్తమనటి గా అవార్డ్ ని తెచ్చిపెట్టింది. దాంతో అటు తమిళమో ఇటు తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రియమణికి బంధువు.

కానీ, ఎప్పుడూ ప్రియమణి ఆమెను అడ్డం పెట్టుకొని అవకాశాలు అందుకోవాలని ట్రై చేయలేదు. లేదంటే హిందీలో ఓ 10 ఏళ్ళ క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేది. ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణి ఇండస్ట్రీకి దూరం అవుతుందనుకున్నారు. కానీ, అటు బాలీవుడ్ లో సూపర్ సస్కెస్ వెబ్ సిరీస్ ఇటు తెలుగులో వెంకటేశ్ లాంటి సీనియర్స్ పక్కన హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది.

వాస్తవంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ప్రియమణి వెంకీ, అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించాలనుకుంది. కానీ, ఆ అవకాశాలు రాలేదు. నితిన్ సరసన బికినీ వేసి అదరగొట్టిన ప్రియమణి గోపీచంద్ సరసన బీచ్ సాంగ్ లో అందాలు ఆరబోసి హీటెక్కించింది. కానీ, అనుకున్న హీరోలతో మాత్రం ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. అయితే, సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం వెంకీ సరసన నారప్ప సినిమాలో అవకాశం అందుకుంది.

ఇక మిగిలింది బన్నీ సరసన నటించే ఛాన్స్ ఒకటే. ఆ ఛాన్స్ వచ్చింది. పుష్ప 2లో. కానీ, బన్నీతో ప్రియమణి అనుకున్నట్టుగా రొమాన్స్ చేసే ఛాన్స్ కాదు. పార్ట్ 1 లో అనసూయ చేసినటువంటి ఇంపార్టెంట్ రోల్ తప్ప హీరోయిన్ రోల్ కాదు. కాకపోతే, ప్రియమణి అనుకున్న కల మాత్రం కొంతవరకు నెరవేరుతుంది. ఇప్పుడు సీనియర్ హీరోలకి మాత్రం హీరోయిన్ కొరత ఉంది. ప్రియమణి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న నటి. టైం కలిసి రావాలంటే. గ్యారెంటీగా మంచి ఛాన్సులు వస్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news