సినిమా ఇండస్ట్రీలో కూడా గొడవలు జరుగుతాయి . మనం మాట్లాడుకోనట్లే కొన్ని సంవత్సరాలు వాళ్లు కూడా మాట్లాడుకోరు. అలాంటి స్టార్ సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్టులోకి వస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఛార్మి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఇద్దరు కూడా టాప్ సెలబ్రిటీసే .
అయితే వీరిద్దరి కాంబోలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు . దానికి కారణం గతంలో స్టార్ హీరో బర్త డే పార్టీలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ అంటూ ప్రచారం జరిగింది . ఇండస్ట్రీలో అందరికీ చేరువైన ఓ హీరో తన పుట్టినరోజు పార్టీ నాడు ఛార్మిను పవన్ కళ్యాణ్ ని మిగతా హీరో హీరోయిన్లు కూడా ఇన్వైట్ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారట .
అయితే ఆ మూమెంట్లో ఛార్మి పవన్ కళ్యాణ్ మధ్య మాటలు యుద్ధం జరిగిందట . ఛార్మి తాగేసి మెగా ఫ్యామిలీ ని కించపరుస్తూ మాట్లాడిందట. ఈ క్రమంలోనే ఫుల్ కోపానికి గురైన పవన్ కళ్యాణ్ ఆమెపై కూసుంత రూడ్ గానే మాట్లాడారట . చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి.. అక్కడ ఉండే వాళ్ళు సర్ది చెప్పే వరకు వచ్చిందట . ఆ గొడవ కారణంగా వీళ్ళు కొన్ని ఏళ్ళు మాట్లాడుకోలేదు .
అంతేకాదు ఇప్పటికి కూడా వీళ్ళ మధ్య ఎటువంటి కాంటాక్ట్ ఉండదట . మెగా ఫ్యామిలీ అందుకే ఛార్మిని కూడా దూరం పెట్టింది అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి . ఆ తర్వాత మెల్ల మెల్లగా ఛార్మి ఇండస్ట్రీకి దూరమైపోయింది..!!