ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. అయితే సమీరారెడ్డి విషయంలో మాత్రం ఎన్టీఆర్‌పై రకరకాల రూమర్లు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో ముందుగా 2005లో బి.గోపాల్ దర్శకత్వంలో నరసింహనాయుడు సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమీషా పటేల్ మెయిన్ హీరోయిన్. కాగా సమీరారెడ్డి రెండో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అశోక్ సినిమాలను వీరిద్దరూ కలిసి జోడి కట్టారు.
నరసింహుడు సినిమా టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించిందని.. ఆ టైంలో ఎన్టీఆర్.. సమీరాకు హైదరాబాద్‌లో ఓ ప్లాట్ తో పాటు, బెంజ్ కార్ కూడా కొనిపెట్టారు అన్న ప్రచారం జరిగింది. అశోక్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎన్టీఆర్ స్వయంగా ఆమెను రెకమండ్ చేయించారని అంటారు. ఒకానొక దశలో ఎన్టీఆర్.. సమీరాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారంట కూడా. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఐతంపూడి. అయితే సమీరారెడ్డి తండ్రి ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు.
ఆమె మోడల్‌గా ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఇంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్.. సమీరకు బాగా దగ్గరైన విషయం ఎన్టీఆర్ మామ చంద్రబాబుకు తెలియడంతో ఆయన ఆగమేఘాల మీద రంగంలోకి దిగి ఎన్టీఆర్‌ను పిలిపించి మాట్లాడడంతో పాటు.. వెంటనే హరికృష్ణతో మాట్లాడి తన మేనకోడలు కుమార్తె లక్ష్మీ ప్రణతితో.. ఎన్టీఆర్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయించారని అంటారు. ఇక ఎంగేజ్మెంట్ జరిగాక ఎనిమిది నెలల తర్వాత ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతి పెళ్లి జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్లతో నటించినా ఎప్పుడు ఇలాంటి పుకార్లు అయితే ఎదుర్కోలేదు.