టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి పాన్ ఇండియా సినిమాలో నటించినున్నాడు. టాలీవుడ్‌లో నందమూరి అక్కినేని కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 7 – 8 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ రెండు కుటుంబాలకు చెందిన మూడో తరం హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో కంటిన్యూ అవుతున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య ఎంతో అనుబంధం ఉండేది.. వారిద్దరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఆ తర్వాత వారిద్దరి వరుసలు బాలయ్య, నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగారు. ప్రారంభంలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎందుకో గాని గ్యాప్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు అయిన హరికృష్ణ, నాగార్జున సన్నిహితంగా ఉండేవారు. వీరిద్దరూ కలిసి సీతారామరాజు సినిమాలో నటించారు.
తన సొంత అన్న అయినా అక్కినేని వెంకట్‌ని ఎప్పుడు అన్నయ్య, బ్రదర్ అని పిలవని నాగార్జున హరికృష్ణను మాత్రం అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయతతో పిలిచేవారట. ఈ విషయాన్ని నాగర్జున ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక హరికృష్ణ వారసుడు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య మధ్య కూడా అంతే మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కూడా సొంత అన్నదమ్ములు కాకపోయినా అదే అనుబంధంతో ఉంటారు.
ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో నాగచైతన్యను ఏరా అని పిలవాలని చెప్పినా.. చైతు మాత్రం ఎన్టీఆర్ పై గౌరవంతో అన్న.. అన్న అని పిలుస్తూ ఉంటాడట. తమ రెండు కుటుంబాల మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉందని.. దానిని తాము ఎప్పుడూ కంటిన్యూ చేస్తామని ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో చెప్పారు. ఇక చైతుతో కలిసి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ క్లాసికల్ సినిమా గుండమ్మ కథ సినిమా రీమేక్‌లో చేయాలని ఉందని ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.