Moviesత‌న ప్లాప్ సినిమాను ఇప్పుడు తీస్తే సూప‌ర్ హిట్ అన్న నితిన్‌......

త‌న ప్లాప్ సినిమాను ఇప్పుడు తీస్తే సూప‌ర్ హిట్ అన్న నితిన్‌… ఆ సినిమా ఇదే…!

ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాతో ఈ నెల ఫ‌స్ట్ వీక్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు యంగ్ హీరో నితిన్‌. ఈ సినిమాలో శ్రీలీల నితిన్‌కు జోడీగా న‌టిస్తోంది. ఈ సినిమాకు రైట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాకు హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ అదిరిపోయాయి. మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాపై నితిన్ భారీ ఆశ‌లు, అంచ‌నాలు పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే నితిన్ త‌న లైఫ్‌లో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అయ్యాన‌నే ఫీలింగ్‌ను బ‌య‌ట‌పెట్టారు. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అయ్యాన‌న్న ఫీలింగ్ త‌న‌కు ఇంకా రాక‌పోయినా… త‌న లైఫ్‌లో అలాంటి మూమెంట్స్ ఉన్నాయ‌న్నారు. త‌న‌కు వ‌రుస‌గా 8 ఏళ్లు ప్లాపులు ఇచ్చినా కూడా ఇష్క్ సినిమాతో బ్యాక్ బౌన్స్ అయ్యాన‌ని.. ఇది నాకు ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మూమెంట్‌… అని దానిని బ‌య‌ట పెట్టాడు.
ఇక త‌న సినిమాల‌ను మ‌ళ్లీ తానే చేయాల్సి వ‌స్తే శ్రీ ఆంజ‌నేయం సినిమాను తాను ఎంచుకుంటాన‌ని నితిన్ చెప్పాడు.

నా సినిమాలే మ‌ళ్లీ నేను చేయాల్సి వ‌స్తే శ్రీ ఆంజ‌నేయం సినిమాను సెల‌క్ట్ చేసుకుంటాను… నా సినిమాల్లో నాకు చాలా ఇష్ట‌మైన సినిమా అది.. కేవ‌లం 2-3 మిస్టేక్స్ వ‌ల్లే ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు… ఆ సినిమాను లేటెస్ట్ టెక్నాల‌జీతో ఇప్పుడు రిలీజ్ చేస్తే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని నాకు న‌మ్మ‌కం ఉంద‌న్నారు. శ్రీ ఆంజ‌నేయం లాంటి ఇన్నోసెంట్ క్యారెక్ట‌ర్ చేయాల‌న్న‌దే త‌న కోరిక అని నితిన్ తెలిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news