Moviesఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా... సూర్య - జ్యోతిక విడాకులు 100 %...

ఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా… సూర్య – జ్యోతిక విడాకులు 100 % నిజ‌మే…!

సెలబ్రిటీల వివాహాలలో చాలా బ్రేకప్‌లు చూస్తూ ఉంటాం. వ్యక్తిగతంగా రాజీ పడకపోవడం అత్తింట్లో ఇమడలేక పోవడం, కెరీర్ పరంగా వచ్చే ఇబ్బందులు.. ఇవన్నీ సెలబ్రిటీల మధ్య గ్యాప్ పెంచి వారు విడాకులు తీసుకోవడానికి కారణం అవుతూ ఉంటాయి. 15, 20 ఏళ్ళు కాదు.. 30 ఏళ్ల వివాహ బంధాలను కూడా వదిలేస్తున్నారు. చిరంజీవి బిడ్డ, నాగబాబు బిడ్డ, నాగార్జున కొడుకు, రజనీకాంత్ కూతురు, ఇలా ఎన్నో చూశాం. సమంత – నాగార్జున కొడుకు విడాకుల వార్తలు చాలా రోజులు నడిచాయి. అవి నిజం అయ్యాయి. ఇక ఇప్పుడు కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో సూర్య.. ఒకప్పటి హీరోయిన్ జ్యోతిక మధ్య విభేదాలు.. విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అలాంటిదేమీ లేదు అని జ్యోతిక వివరణ ఇస్తున్నా సరే.. కొన్ని సందేహాలు చూస్తుంటే వీరిద్దరూ త్వరలోనే విడిపోబోతున్నారు అన్నది నిజం అనేలా ఉంది. జ్యోతిక హీరోయిన్గా మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు సూర్యతో ప్రేమలో పడి 2006లో పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు 18 సంవత్సరాల పాటు హ్యాపీగా సాగిన సంసార జీవితంలో ఇప్పుడు విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. జ్యోతిక చెన్నైని విడిచిపెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ముంబై వెళ్ళిపోయింది. అప్పటినుంచి విడాకుల వార్తలు మరింత పెరిగాయి.

దీనిపై జ్యోతిక స్పందిస్తూ.. తాను ముంబై వదిలి చెన్నైకి వచ్చి 27 ఏళ్లు అయింది.. మా తల్లిదండ్రులతో ఎక్కువగా కలిసి ఉన్నదే లేదు.. రెండు, మూడు సార్లు వారికి కరోనా వచ్చినా వెళ్ళలేకపోయాను. బిడ్డగా వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత కూడా నాదే.. అందుకే ముంబై వెళుతున్నా.. నాతోటే నా పిల్లలు అక్కడే స్కూల్ చూడాల్సి వచ్చింది.. అత్తింటి వారితో నాకు ఏ సమస్య లేదు అని జ్యోతిక వివరణ ఇచ్చుకుంది. సూర్య మాత్రం స్పందించలేదు. అయితే ఇక్కడే చాలా సందేహాలు వస్తున్నాయి. నిజంగా జ్యోతిక తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటే.. చెన్నై వదిలేసి ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు.

వారిని తన దగ్గరికి తెచ్చుకుంటే సరిపోయేది. చెన్నైలోనే కావలసినన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మరి భర్తను ఒంటరిని చేసి పిల్లలతో కలిసి జ్యోతిక ఎందుకు ముంబై వెళ్ళిందో ఆమెకే తెలియాలి. పైగా సూర్య వాళ్ళది ఉమ్మడి కుటుంబం. పంతాలు, పట్టింపులు, సాంప్రదాయాలు ఎక్కువ వీటి మధ్యలో జ్యోతిక ఇమ‌డ లేకపోయిందని అంటున్నారు. ఇక జ్యోతిక తల్లిదండ్రులకు జ్యోతిక ఒక్కటే కుమార్తె కాదు.. నగ్మా, రోషిని కూడా ఉన్నారు. వాళ్లకు తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి. మరి జ్యోతిక తల్లిదండ్రులను చూడాలని చెప్పడం ఏంటి.. ఈ ప్రశ్నలకు ఆన్సర్లు ప్రస్తుతానికి అయితే లేవనే చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news