టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఒకప్పటి మిస్ ఇండియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. టాప్ మోడల్ నమ్రతా శిరోద్కర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వివాహం పెద్ద సంచలనం. తనకంటే వయసులో పెద్ద అయినా నమ్రతను.. మహేష్ పెళ్లి చేసుకోవడం తెలుగు గడ్డపై చాలామంది మహేష్ అభిమానులకు నచ్చలేదు. అయితే తర్వాత వారిద్దరూ తమ దాంపత్య జీవితాన్ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ దంపతులకు గౌతమ్, సితార అనే ఇద్దరు అందమైన పిల్లలు ఉన్నారు.
మహేష్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీ జీవితానికి ఎంత విలువ ఇస్తారో చెప్పక్కర్లేదు. వంశీ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నప్పుడు.. ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఐదేళ్లపాటు సీక్రెట్ గా ప్రేమించుకుని 2005లో పెళ్లి చేసుకున్నారు. మహేష్ తనతో పాటు నటించిన హీరోయిన్లలో నమ్రతను మాత్రమే ప్రేమించాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ తెలియని మరో విషయం కూడా ఉంది. తనతో పాటు మురారి సినిమాలో కలిసిన సోనాలి బింద్రేని కూడా మహేష్ చాలా ఇష్టపడ్డాడట.
ఆమెతో కలిసి నటించాలన్న ఆశతో పట్టుబట్టి కృష్ణవంశీకి చెప్పి మరి ఆమెను హీరోయిన్గా తీసుకునేలా చేశాడన్న ప్రచారం కూడా అప్పట్లో నడిచింది. ముఖ్యంగా సోనాలి అందానికి మహేష్ మంత్రముగ్ధుడు అయిపోయాడని.. ఆమెతో కలిసి నటించాలని ఎంతో ఇష్టపడ్డాడని.. అందుకే ఆమెను మురారి సినిమాలో హీరోయిన్గా తీసుకునేలా తెరవెనక చక్రం తిప్పాడని అంటారు. మురారి సినిమాలో మహేష్ బాబు, సోనాలి జంట ఎంత క్యూట్ గా ఉందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నమ్రతతో ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించి అది పెళ్లి వరకు వెళ్ళిపోయింది.