కొన్ని కొన్ని సినిమాలు మనం ఎన్ని సార్లు చూసిన తనివి తీరవు . అంతేకాదు ఆ సినిమాలోని డైలాగ్స్ కొన్ని సంవత్సరాలైనా అలాగే గుర్తుండిపోతాయి. లైఫ్ లో మనకి బాగా ఎక్కడో తగలాల్సిన చోట తగులుతూ ఉంటాయి. అలాంటి డైలాగ్ ఒకటి యమదొంగ సినిమాలో ఉంది. మమతా మోహన్ దాస్ – ఎన్టీఆర్ – ఆలీను తిడుతూ రోడ్డుపైకి వచ్చి “ట్రంక్ రోడ్డులో గుడ్డలు ఊడదీసి కొడతా నాయాల్లారా” అనే డైలాగులు చెబుతుంది.
థియేటర్లో ఈ డైలాగ్ విన్న ఎవరైనా సరే నవ్వు ఆపుకోకుండా తప్పట్లు కొట్టకుండా ఉండే మనిషి ఉండడు . అంతలా ఈ డైలాగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది . అప్పటివరకు సరదా సరదా డైలాగ్స్ రాసుకొచ్చిన రాజమౌళి ఈ సినిమాల కోసం ఒక్కసారిగా హాట్ డైలాగ్స్ రాయడం మొదలుపెట్టారు . జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రియమణి – మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యమదొంగ . ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కాదు.
ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా మోస్ట్ ఫేవరెట్ గా నిలిచిపోయింది. కాగా ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ని చీట్ చేసే క్రమంలో ఆలీ ఎన్టీఆర్ పై ఆమె సీరియస్ అవుతూ ..” ఇంకొకసారి నా వీధిలో కనపడితే నెల్లూరు ట్రంక్ రోడ్లో గుడ్డలు ఊడ తీసి కొడతా నాయాల్లారా ” అంటూ ఘాటుగా డైలాగ్ చెబుతుంది . ఆ డైలాగ్ చూసిన జనాలు రాజమౌళి ఎవరికో బాగా తగిలేలానే ఈ డైలాగ్ రాశారు అని అప్పట్లో జనాలు చెప్పుకున్నారు .
దానికి కారణం రాజమౌళి ఎప్పుడు ఒకే సీక్వెన్స్ ఒకే జోనర్ మోడ్ లో సినిమాలు తీస్తారని .. ఆయన సినిమాలో ఘాటైన డైలాగులు ఉండవు అని కామెంట్స్ చేశారు . అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేసేలా రాజమౌళి ఈ డైలాగ్ రాసుకోవచ్చారు అంటూ అప్పట్లో జనాలు తెగ చర్చించుకున్నారు . ఇక తర్వాత రాజమౌళి తన సినిమాల్లో ఎలాంటి డైలాగ్స్ పెడుతూ వచ్చారో మనం చూసాం . ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ గా రాజమౌళి తన పేరుని మారుమ్రోగి పోయేలా చేసుకున్నాడు..!!