టాలీవుడ్ లో నందమూరి, అక్కినేని కుటుంబాల నుంచి రెండో తరం హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ, నాగార్జున. వీరిద్దరూ దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పటికే నాగార్జున ఇద్దరు కుమారులు హీరోలుగా పరిచయం అయ్యారు. త్వరలోనే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి హీరోల మధ్య మాటలులేవన్నది వాస్తవం. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది.. ఎంతో ఆప్యాయతతో ఉండే బాలయ్య, నాగార్జున ఎందుకు మాట్లాడుకోరు.. అన్నదానిపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు ఉన్నాయి.
అయితే గత కొన్నేళ్ల క్రితం జరిగిన పరిణామాలతో బాలయ్య బాధపడ్డారని.. అందుకే నాగార్జునతో సఖ్యతతో ఉండేందుకు ఆయన ఇష్టపడరని ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున, బాలయ్య గురించి మాట్లాడుతూ సెటైర్ వేయటం అప్పట్లో సంచలనం అయింది. పదేళ్ల క్రితం బాలయ్య పై ఎక్కువగా ట్రోలింగ్ జరిగేది. ఆయన నటించిన కొన్ని సినిమాలలో సీన్లను ఆయన యాంటీ అభిమానులు ముఖ్యంగా మెగా అభిమానులు గట్టిగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఆ టైంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలయ్య ప్రస్తావన రాగానే.. బాలయ్య చేయి పెట్టగానే ట్రైన్ ఆగిపోతుంది. అలాంటి సీన్లలో తాను నటించలేను అంటూ కాస్త ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.
దీనిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఇది బాలయ్య దృష్టికి వెళ్ళింది. ఇది బాలయ్యను బాగా బాధపెట్టిందని.. అందుకే నాగార్జున విషయంలో ఆయన హర్ట్ అయ్యారని ఇండస్ట్రీ జనాలు చెవులు కోరుకుంటు ఉంటారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉండగానే ఇండస్ట్రీ ప్రముఖుల అందరిని పిలిచి నాగార్జున ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు.. చిన్నాచితకా హీరోలు, ఆర్టిస్టులు అందరినీ ఆహ్వానించిన నాగార్జున.. బాలయ్యను పిలవలేదు. ఇది కావాలని జరిగిందా.. లేదా పొరపాటున జరిగిందా.. అన్నది తెలియదు. కానీ ఇది కూడా బాలయ్యను బాగా బాధపెట్టింది.
ఈ కార్యక్రమం జరిగిన మూడు రోజుల తర్వాత నాగార్జున స్వయంగా బాలయ్య ఇంటికి వెళ్లి పొరపాటు జరిగిందని చెప్పినా కూడా బాలయ్య మనసు అంగీకరించలేదు. ఇదంతా కావాలని జరిగినట్టుగా బాలయ్య భావించాడని అంటారు. అందుకే ఏఎన్ఆర్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య ఆయనను చివరిసారిగా చూసేందుకు వెళ్లలేదన్న ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోల మధ్య గ్యాప్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. బాలయ్య తన వందో సినిమా ప్రారంభోత్సవానికి వెంకటేష్‌ను ఆహ్వానించిన నాగార్జునను మాత్రం పిలవలేదు. నాగార్జున, బాలయ్య మధ్య గ్యాప్ గురించి గట్టిగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇక బాలయ్యకు పోటీగా ఉండే మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో నాగార్జునకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. దీంతో నాగర్జున ఎక్కువగా మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.
వైజాగ్‌లో సుబ్బరామిరెడ్డి గారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాగార్జున వేదిక మీద స్వయంగా బాలయ్య పక్కన ఉండగానే మా ఇద్దరికీ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.. ఇదంతా అవాస్తవం అని ఖండించే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న బాలయ్యను దగ్గరికి తీసుకొని హత్తుకున్నారు. బాలయ్య కూడా నాగార్జున ఆ మాట అన్న వెంటనే నవ్వుతూ స్పందించిన.. బాలయ్యలో అనుకున్నంత కళలేదు. ఆ తర్వాత కూడా నాగార్జున, బాలయ్య కలుసుకున్న సందర్భాలు లేవు. ఏది ఏమైనా మొత్తానికి ఈ ఇద్దరు హీరోల మధ్య అంత సఖ్యత లేకపోవడం అక్కినేని, నందమూరి అభిమానులను కూడా కలవరపెడుతోంది.