Newsమ‌లైకా మాజీ భ‌ర్త అర్బాజ్‌ఖాన్‌కు ఆ న‌టితో బ్రేక‌ప్‌.. చిచ్చు పెట్టిందెవ‌రు...!

మ‌లైకా మాజీ భ‌ర్త అర్బాజ్‌ఖాన్‌కు ఆ న‌టితో బ్రేక‌ప్‌.. చిచ్చు పెట్టిందెవ‌రు…!

బాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మ మలైకా అరోరా, అర్జున్ కపూర్ ప్రేమాయణం దేశవ్యాప్తంగా నాలుగైదు సంవత్సరాలుగా ఎంత సంచలనం రేపుతుందో చూస్తూనే ఉన్నాం. తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నోడు అయినా అర్జున్ కపూర్‌తో మలైకా చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ సిగ్గు విడిచేసి విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ డేటింగ్ చేస్తోంది. నాలుగున్న‌ర‌ పదుల వయసులోనూ మలైక బికినీలు వేసుకుని బీచ్‌లో అందాలు ఆరబోస్తూ ఎంత రచ్చ చేస్తుందో చూస్తూనే ఉంటాం.

ఇక అర్జున్ కపూర్ కోసమే మలైక తన పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకుంది. తన భర్త అర్బాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చేసింది. మలైక నుంచి విడిపోయాక అర్బాజ్ విదేశీ బ్యూటీ, నటి, మోడల్ అయినా జార్జియా ఆండ్రియానాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట విడిపోయారు. నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్న తాము విడిపోయినట్టు జార్జియా క్లారిటీ ఇచ్చేసింది. అయితే వీరి మధ్య అర్బన్ మాజీ భార్య మలైకా ఆరోరా చిచ్చు పెట్టిందని.. ఆమె వల్లే వీరు విడిపోయారంటూ ప్రచారం జరుగుతుంది.

1998లో వివాహం చేసుకున్నారు వీరు 2017 లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తమ కొడుకు అర్హాన్‌కి వీరిద్దరూ సహ తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. తన మాజీ భర్త జార్జియా ప్రేమలో పడి కొడుకులను నిర్లక్ష్యం చేస్తాడని మలైకా ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి విడదీసింది అంటూ ప్రచారం జరిగింది. తమ ప్రేమలో మలైక జోక్యం ఎప్పుడు లేదని జార్జియా తెలిపింది. మా మధ్య సంబంధం లో విలువైనది ఒకే విధమైన ఆసక్తులు కలిగి ఉండటం.. కానీ మేం మా ఆలోచనలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోలేదు. ఇది మా సంబంధానికి అనుకూలంగా లేదని స్ప‌ష్టం చేసింది.

నేను ఇష్టం వచ్చినట్టుగా ఎక్క‌డికైనా వెళ్లాలని అనుకుంటాను.. అతడు ఆ విధంగా కోరుకొన్నప్పుడు అది సరైనది కాదని అర్బాజ్ కి కూర్చుని సినిమాలు, డాక్యుమెంటరీలు చూడటం చాలా ఇష్టం. నేను ఒకచోట కూర్చోలేను అలా మా ఇద్దరి ఇష్ట ఇష్టాలు, ఆసక్తులు కల‌వలేదని జార్జియా స్పష్టత ఇచ్చింది. తాము ఇప్ప‌ట‌కీ మంచి స్నేహితులుగా ఉంటామని జార్జియా క్లారిటీ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news