Moviesవిజ‌య‌నిర్మ‌ల‌, ఇందిర కంటే ఆ స్టార్ హీరో మ‌ర‌ద‌లితో కృష్ణ పెళ్లి...

విజ‌య‌నిర్మ‌ల‌, ఇందిర కంటే ఆ స్టార్ హీరో మ‌ర‌ద‌లితో కృష్ణ పెళ్లి ఫిక్స్ అయ్యిందా… చెడగొట్టిందెవ‌రు..!

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు తిరుగులేని స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందారు సూపర్ స్టార్ కృష్ణ. ఒక‌ప్పుడు కృష్ణ నిర్మాత‌ల హీరోగా పాపుల‌ర్‌. ఆయ‌న‌తో సినిమాలు తీసిన నిర్మాత‌లు ఎవ‌రైనా న‌ష్ట‌పోతే కృష్ణ వెంట‌నే త‌న నెక్ట్స్ సినిమాల‌కు అదే నిర్మాత‌ల‌కు ఫ్రీగా కాల్షీట్లు ఇచ్చేవారు. అలా ఎంతో మంది నిర్మాత‌ల‌కు కృష్ణ ఉచితంగా డేట్లు ఇచ్చేవారు. అందుకే త‌న కెరీర్‌లో ఆయ‌న వంద‌ల సినిమాల్లో న‌టించినా కూడా మ‌హేష్‌బాబు హీరో అయ్యే వ‌ర‌కు కృష్ణ పెద్ద‌గా సంపాదించుకుంది ఏమీలేదు.

ఇటు త‌న సొంత బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసి న‌ష్ట‌పోవ‌డం, అటు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి న‌ష్ట‌పోవ‌డంతో కృష్ణ సినిమాల్లో సంపాదించింది అంతా న‌ష్ట‌పోయారు. ఇక న‌ట‌విభూష‌ణ్ శోభ‌న్‌బాబు, కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్‌. వీరిద్ద‌రు ఇండ‌స్ట్రీలో మంచి స్నేహితులు.. ఒక‌రి క‌ష్ట‌సుఖాల్లో మ‌రొక‌రు సాయం చేసుకునేవారు.

ఇక శోభన్ బాబు ఎక్కువగా కృష్ణ గారి ఇంట్లోనే ఉండేవార‌ట‌. అటు కృష్ణ తల్లిదండ్రులు శోభన్ బాబును త‌మ పెద్దబ్బాయి అని పిలిచేవారట. ఆ టైంలో శోభన్ బాబు మరదలు ఒకామెతో కృష్ణ‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డ‌డంతో ఆమెతో కృష్ణ చ‌నువుగా ఉండేవార‌ట‌. అప్పుడు శోభ‌న్‌బాబు కుటుంబం ఆమెను కృష్ణ‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ని కూడా అనుకునేద‌ట‌. ఇదే విష‌యాన్ని వాళ్లు కృష్ణ త‌ల్లిదండ్రుల‌కు కూడా చెప్పార‌ట‌.

అయితే కృష్ణ త‌ల్లి మాత్రం నాకు కోడ‌లిగా వ‌చ్చే అమ్మాయి నా కొడుకులా తెల్ల‌గా ఉండాల‌ని చెప్ప‌డంతో ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యింది. అలా శోభ‌న్‌బాబు మ‌ర‌ద‌లిని చేసుకుని ఉంటే కృష్ణ‌, శోభ‌న్‌బాబు మ‌రింత ద‌గ్గ‌ర బంధువుల అయ్యి ఉండేవారు. కానీ కృష్ణ త‌ల్లి పెట్టిన కండీష‌న్‌తో ఈ బంధానికి బ్రేక్ ప‌డిన‌ట్ల‌య్యింది. అయినా వీరి స్నేహం మాత్రం చిర‌కాలం అలాగే ఉండిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news