Moviesప‌వ‌న్ పెట్టిన టార్చ‌ర్‌కు క్రిష్ ఈ చెత్త నిర్ణ‌యం తీసుకున్నాడా...!

ప‌వ‌న్ పెట్టిన టార్చ‌ర్‌కు క్రిష్ ఈ చెత్త నిర్ణ‌యం తీసుకున్నాడా…!

క్రిష్ పేరు చెబితే టాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాలు గుర్తుకొస్తాయి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, గౌతమీపుత్ర శాతకర్ణి ఇలా ఎన్నో మంచి సినిమాలు అందించిన క్రిష్.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఒప్పుకుని నరకం అనుభవిస్తున్నాడు. గత మూడు ఏళ్లుగా ఎవరిని ఏం అనలేక.. అలా మౌనంగా ఉండిపోయాడు. చివరకు పవన్ చూపిస్తున్న చుక్కల దెబ్బకు అసలు కొన్నాళ్లపాటు సినిమాలు మానేయాలి అన్న నిర్ణయానికి వచ్చేసినట్టు ఇండస్ట్రీ గుసగుసల సారాంశం. పవన్ హరిహర వీర‌మ‌ల్లు సినిమాను అసలు పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు.

ఈ సినిమా రెండున్నర సంవత్సరాల క్రితం సెట్స్ మీదకు వెళ్ళింది. మధ్యలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు పూర్తి చేశాడు. అవి రిలీజ్ కూడా అయిపోయాయి. ఇప్పటికి కూడా పవన్ వీర‌మ‌ల్లు సినిమాను పక్కన పెట్టేసి ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మరో ఐదు నెలలపాటు పవన్ సినిమాల షూటింగ్ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత కూడా ఓజి సినిమా షూటింగ్ పూర్తి చేయాలి. అప్పుడు అయినా హరిహర వీరమల్లుకు డేట్లు ఇస్తాడు అన్న నమ్మకం అయితే లేదు.

భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్త‌యాక‌ గాని వీరమల్లు సినిమా సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ జరగాలంటే మరో ఏడాదికి టైం పట్టేలా ఉంది. అప్పటివరకు క్రిష్ ఖాళీగా ఉండాలా.. ఇప్పటికీ క్రిష్ రెండున్నర సంవత్సరాలుగా పవన్ సినిమా కోసం పనిచేస్తున్నాడు. పవన్ అసలు వీరమల్లు సినిమాకు ఎప్పుడు డేట్‌లు ఇస్తాడో.. ఇవ్వడో తెలియని పరిస్థితి. అటు నిర్మాత ఏం.రత్నం పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదు. ఈ సినిమా కోసం వేసిన సెట్స్‌కు వడ్డీలు కడుతూ వస్తున్నాడు.

ఈ సినిమా మరో ఏడాదికి రిలీజ్ అయినా కూడా రత్నంకు వడ్డీల బొక్క తప్ప ఏం ఉండదని ప్రచారం జరుగుతోంది. తన అసంతృప్తిని బయటపెడదాం అంటే పవన్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని క్రిష్ ఏమి అనకుండా మౌనంగా ఉంటున్న పరిస్థితి. దీనితో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటేనే బెటర్. ఆ తర్వాత కూడా ఏదైనా ఒక చిన్న సినిమా చేసుకొని.. పవన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వీరమల్లు సినిమా పూర్తి చేయటం మినహా.. టీం చేసేది ఏం లేదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news