నీకోసం సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు ఆర్పీ పట్నాయక్. ఈ సినిమా మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ మొబైల్ లో మోగుతూనే ఉంటుంది. దాంతో చిత్రం సినిమాతో చిత్ర పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమైన తేజ ఆ సినిమాకి ఆర్పీని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు.
మొదటి సినిమా నుంచి తేజ-ఆర్పీ పట్నాయక్-కులశేఖర్-రసూల్ ఒక టీమ్‌గా సెట్ అయ్యారు. ఏ సినిమా చేసినా ఇదే టీమ్మ్ అన్నీ కలిసి ఫైనల్ చేసుకునేవారు. గోపీచంద్ కి అవకాశం ఇచ్చినప్పుడు కూడా వీరందరూ ఉండే ఆడిషన్స్ చేసి ఫైనల్ చేశారు. అలా తేజ, ఆర్పీ పట్నాయక్ ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే, కొంతకాలం తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిఓయారు.
దీనికి కారణం తేజకి ఆర్పీ మీద కోపం రావడమే. ఆర్పీలో నటుడు కూడా ఉన్నాడు. అందుకే, ఆయన శ్రీను వాసంతి లక్ష్మీ అనే సినిమాతో నటుడిగా మారాడు. కానీ, అది తేజకి ఇష్టం లేదు. ఆర్పీ మంచి సంగీత దర్శకుడు. దాన్ని వదిలేసి నటుడిగా మారడం నాకిష్టం లేదని ఇదే విషయాన్ని పట్నాయక్ కి చెప్తే వినలేదని అందుకే, దూరం పెట్టినట్టు చెప్పాడు.
తేజ చెప్పినట్టుగానే ఆర్పీ కొంతకాలానికి అటు నటుడిగా సక్సెస్ కాలేకపోయాడు. సంగీత దర్శకుడిగానూ సినిమాలు లేవు. మళ్ళీ ఇంతకాలానికి అహింస సినిమాతో తేజ, పట్నాయక్ ఇద్దరు కలిశారు. ఇకనైనా ఈ సినిమా ఏరకంగానూ వీరు గతంలో చేసిన మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. మరి ఈ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి.