Moviesఅలియా వేసుకున్న ఈ చీర రేటు తెలిస్తే కళ్ళు తిరిగి కింద...

అలియా వేసుకున్న ఈ చీర రేటు తెలిస్తే కళ్ళు తిరిగి కింద పడతాం..!

అలియా భట్ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆలియా ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు చక్కగా పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె రామ్ చరణ్‌కి జోడిగా నటించింది. అచ్చ తెలుగు ఆడ‌పిల్ల‌లా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. తాజాగా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరి వివాహ వేడుకల్లో.. ఫంక్షన్ కోసం ఆలియా లడ్డు పిల్ల చీరలో తళుక్కుమంది. అభిమానులు అలియా సొగసైన చీర అందాన్ని పిచ్చపిచ్చగా ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ కాగానే కామెంట్లతో అలియా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

లడ్డు కలర్లో ఆ చీరలో ఆలియాను పదేపదే చూడాలనిపించేలా ఉంది. ఆలియా తన ఇన్‌స్టాలో ఈ చీరతో ఉన్న లుక్ షేర్ చేసి ఎల్లో దేర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లడ్డు పిల్ల అనే క్యాప్షన్‌తో ఆలియా తన ఇన్‌స్టాలో ఫోటోల కొల్లేజ్‌ను పోస్ట్ చేసింది. ఈ లడ్డు పిల్ల అనే పదానికి అర్థం ఏమిటో గాని.. ఈ పదం ఒక వైరల్ వీడియో నుంచి పుట్టుకొచ్చింది.

ఆలియా వేసుకున్న ఈ పసుపు చీర అందాన్ని పొగుడుతూ హీరోయిన్లు భూమి పెడ్నేకర్, నేహా ధూపియా, ప్రితీజింతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆలియా వేసుకున్న చీరరేటు ఎంతో తెలుసా.. ఈ చీర అనవిలా ఆమోద కలెక్షన్ లేబుల్ నుంచి సేకరించింది. దీనిని ఎల్లో బాగ్ ఆర్గాన్జా అప్లికేషన్ అని పిలుస్తారు. దీని ఖరీదు రెండు లక్షల యాభై వేలు. ఈ చీర వేసుకున్న ఆలియా పసుపు క‌ల‌ర్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news