నేచురల్ స్టార్ నాని మారాల్సిన టైం వచ్చింది. నాని ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే అందులో కథ, కథనంలో కొంతైనా విషయం ఉంటుందన్న నమ్మకాలు అందరిలోనూ ఉంటాయి. నాని చేస్తోన్న సినిమాలు చూస్తే అది నిజం అనిపిస్తోంది కూడా..! అయితే నాని చేస్తోన్న సినిమాలు కొందరికే కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి అరా సినిమాలు వదిలేస్తే చాలా సినిమాల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం లేదు. విమర్శకుల వరకు మెప్పు పొందుతున్నాయి. రేటింగుల వరకు బాగానే వస్తున్నాయి.
కానీ కలెక్షన్ల దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేస్తోన్న పరిస్థితి. నాని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు. దసరా సినిమాను వదిలేస్తే మిగిలిన సినిమాలకు సరైన రేంజ్‌లో కలెక్షన్లు రాలేదు. మరీ ముఖ్యంగా నాని మార్కెట్ పెరగడం లేదు. పైగా దసరా హిట్ అయినా బడ్జెట్ ఓవర్ అవ్వడం వల్ల లాభాలు రాలేదు. నాని ఒక్కో సినిమాకు రు. 25 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
నాని సినిమాల థియేట్రికల్ బిజినెస్ కూడా రు. 25 కోట్ల రేంజ్‌లో ఉంటోంది. అంటే నాని రెమ్యునరేసన్ ఈక్వెల్ అతడి సినిమాల థియేట్రికల్ బిజినెస్ అనుకోవాలి. నాని నిర్మాతలకు లాభాలు రావడం లేదు.. సినిమా హిట్ అయినా వడ్డీలతో కలుపుకుంటే చేతికి మిగిలేది జీరోయే. ఈ విషయంలో ఎంత నిజాలు దాచాలనుకున్నా వాస్తవాలు వేరుగా ఉన్నాయంటున్నారు. హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలోనూ తన సినిమాకు భారీ లాభాలు వస్తున్నాయని కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.
అయితే నాని చెప్పేది అబద్ధం అని మరోసారి ఫ్రూవ్ అయ్యింది. హాయ్ నాన్న సినిమాకు హిట్ టాక్ వచ్చింది. రేటింగులు బాగా వచ్చాయి. కలెక్షన్లు తుస్సుమన్నాయి. ఫస్ట్ డే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ చాలా తక్కువ.. అంటే రు. 4 కోట్ల లోపు మాత్రమే. ఫస్ట్ డే హిట్ టాక్‌తో కూడా కేవలం 15 % రికవరీ మాత్రమే వచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సినిమా లేదు. ఎన్నికల హడావిడి ముగిసింది. ఈ టైంలో నాని సినిమా పుంజుకోకపోతే భారీ నష్టాలు తప్పవు. నాని కెరీర్‌లో పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిన అంటే సుందరానికి సినిమాకు ఫస్ట్ డే వచ్చిన వసూళ్లు కూడా హాయ్ నాన్న సినిమాకు రాలేదు. ఏదేమైనా నాని మధ్యలో కొన్ని మాస్ సినిమాలు.. కొన్ని యాక్షన్, కామెడీ టైఫ్ లేదా డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేయకపోతే నాని కొన్ని వర్గాల ప్రేక్షకుల హీరోగా మిగిలిపోయి.. అతడి కంటే చిన్న హీరోల కంటే కూడా అతడి గ్రాఫ్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది.