మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్ గురించి తన కెరీర్ ప్రారంభంలో వచ్చినన్ని నెగిటివ్ కామెంట్స్ ఇంకో హీరో విషయంలో రాలేదేమో. అప్పట్లో చరణ్ ఫేస్ కట్ చూసి అసలు హీరో మెటీరియలేనా..? ఇంత బలవంతంగా జనాల మీద రుద్దడం ఏంటో..?అని అందరూ మాట్లాడుకున్నారు.
చెప్పాలంటే ఇలాంటి కామెంట్స్ విన్న తర్వాత హీరోగా దింపడానికి సాహసం చేయరు. కానీ, చరణ్ మెగాస్టార్ కొడుకు. అందుకే, హీరోగా లాంచ్ చేసే బాధ్యత పూరి జగన్నాధ్ కి అప్పగించారు. కథపై ఎన్నో కసరత్తులు జరిగాయి. ఫైనల్ గా చిరుత మొదలైంది. రిలీజ్ చేసిన ప్రతీ పోస్టర్ గురించి నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఫైనల్ గా సినిమా రిలీజ్ అయింది. టాక్ కూడా అంత గొప్పగా రాలేదు.
అలాంటి హీరోతో తర్వాత చేసిన అతిపెద్ద సాహసమే మగధీర. రాజమౌళి దర్శకుడు. ప్రభాస్ చేయాల్సిన కథ. ఇటు తిరిగింది. అల్లు అరవింద్ నిర్మాత కాబట్టి కొంచం అందరిలోనూ నమ్మకాలు ఏర్పడ్డాయి. అప్పటికీ రాజమౌళి మీద కూడా అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా..? అంటే కొన్ని సందేహాలు కూడా ఉండేవి. దాదాపు షూటింగ్ కంప్లీట్ కావచ్చింది. అప్పటికే బడ్జెట్ 40 కోట్లు దాటేసింది.
ఆ మాట విన్న తర్వాత రాజమౌళికి ఒణుకొచ్చింది. కానీ, రాజమౌళి తీసిన రష్ చూసి అల్లు అరవింద్ కి మాత్రం విపరీతమైన నమ్మకం వచ్చింది. ఫైనల్ గా సినిమా రిలీజైంది. పెట్టిన పెట్టుబడికి మూడింతలు లాభాలు వచ్చాయి. ఒకవేళ అప్పట్లో మగధీర గనక ఫ్లాప్ అయిన్ ఉంటే అల్లు అరవింద్ చాలాకాలం అడ్రస్ ఉండేవాడు కాదు. ఓ టాక్ షోలో ఆయనే ఇన్‌డైరెక్ట్ గా చెప్పారు.