సాధారణంగా డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇది హీరోలకే పరిమి తం. అయితే.. డాక్టర్ చదువుతూ.. మధ్యలోనే వదిలేసి మరీ.. సినీ ఫీల్ఢ్ లొకి వచ్చిన హీరోయిన్‌లు పెద్దగా ఎవరూ లేరు. ఉంటే.. అది తెలుగు హీరోయిన్ జయప్రదే. ఈమె ఎంత గొప్ప నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన చారెడేసి కళ్లతో తెలుగు స్క్రీన్‌పై చేసిన అభినయం నభూతో అనాల్సిందే.
అయితే.. డాక్టర్ కావాలని అనుకుని.. యాక్ట్రస్ గా ఎలా సినీరంగంలోకి వచ్చిందనేది మాత్రం ఇంట్రస్టింగ్. ఇదే విషయంపై జయప్రద ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “డాక్టర్ కావాలనుకున్నా. కానీ ఆర్టిస్ట్ అయ్యా. అనర్గళంగా సినిమాలో ఏ డైలాగ్ అయినా చెప్పాలి. ఎలాంటి వారితోనైనా అనర్గళంగా మాట్లాడాలి. నాకు అవన్నీ కుదిరేవి కావు. ప్రతిదీ నాకు విరుద్ధంగా ఉండే అట్మాస్ఫియర్. భగవంతుడు నా పట్ల చాలా దయతో వ్యవహరించేవాడు. నా లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండేది.
బాలచందర్, విశ్వనాథ్, బాపు , దాసరి, రాఘవేంద్రరావు ఇలా అందరూ నన్ను అర్థం చేసుకున్నవారే“ అని జయప్రద చెప్పడం గమనార్హం. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా.. హిందీలోనూ జయప్రద తన సత్తా చాటుకుంది. అమితాబ్‌తో చేసిన రెండుసినిమాలు ఆమెకు సూపర్ హిట్లుగా నిలిచాయి. తమిళ్, కన్నడ, మలయాళం చేసినప్పుడు కూడా మమ్మట్టి, లాల్, రాజ్‌కుమార్ ల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇక, రాజకీయాల్లోనూ ప్రవేశించిన తొలి తెలుగు హీరోయిన్ జయప్రదే కావడం గమనార్హం.
ఆమె యూపీలోని రాంపూర్ నుంచి రెండుసార్లు ఎస్పీ తరపున ఎంపీగా కూడా ఆమె విజయం దక్కించుకున్నారు. తనది కాని యూపీ రాష్ట్రంలో రాజకీయాలు చేయడం మరో విశేషం. నిజానికి ఆమె కోరుకున్నట్టు డాక్టర్ అయి ఉంటే.. కేవలం కొందరికే పరిమితమై ఉండేది. కానీ, యాక్టర్ కావడంతో అనేక కోణాల్లో జయప్రద తన ప్రతిభను చాటుకుందని అనడంలో సందేహం లేదు.