టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రెసెంట్ ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . నిన్న మొదటి వరకు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు . సలార్ సినిమాతో తనపై పెంచుకున్న ఎక్స్పెక్టేషన్స్ ట్రిపుల్ చేసేశాడు ప్రభాస్.
కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెర్కెక్కిన సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేస్తుంది . కలెక్షన్స్ పరంగా ఎవరు టచ్ చేయలేని రికార్డులను నెలకొల్పింది. ఈ క్రమంలోనే సలార్ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రశాంత్ నీల్.
“ప్రభాస్ గురించి అందరూ ఏవేవో చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నాను.. ఆయన మంచితనం కళ్లారా చూశాను.. ఫుడ్ తో చంపేస్తాడు ..మంచి ఫుడీ.. అంతే కాదు ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు ..స్టార్ట్ స్టేటస్ అసలు చూపించడు.. ఫ్రెండ్లీగా జోబియల్ గా ఉంటారు.. అందరితో కలిసి మెలిసి ఉండడం ప్రభాస్ కి ఇష్టం . అయితే ప్రభాస్ ఓ విషయంలో మాత్రం నాకు నచ్చలేదు. చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఓకే – సరే అంటూ చేసేస్తాడు. ఎక్కడ కూడా ఇది నా వల్ల కాదు ..నేను చేయలేను అని అనడు ఆ టూ మచ్ మంచితనం నాకు నచ్చలేదు” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ ఇవే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..!!