శేఖర్ కమ్ముల టాలీవుడ్ ఇండస్ట్రీలో డీసెంట్ అని ఆయన సినిమాల ద్వారా నిరూపించుకున్నాడు. అంతేకాదు, కథ పూర్తయ్యేవరకూ ఏ హీరోను కలవడు..ఏ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకోడు. స్క్రిప్ట్ అంతా పక్కాగా వచ్చాకే ఆర్టిస్టులను మిగతా టెక్నీషియన్స్ ని ఎంచుకుంటారు. ఆయన ఆఫీసులోనే పెద్ద హీరో అయినా ఓసారి రిహార్సల్స్ చేయిస్తాడు.
ఇక కొత్త నటీనటులైతే కనీసం రెండు నెలలు స్క్రిప్ట్ మొద్దం బైహార్డ్ చేసి టెస్ట్ షూట్స్ అయ్యాక యాక్టింగ్ బాగా చేస్తున్నారని ఓ జడ్జెంట్ కి వచ్చాక గానీ సెట్స్ మీదకి రారు. అంత పక్కాగా ప్లాన్ చేసుకుంటారు శేఖర్ కమ్ముల. అంతేకాదు, షూటింగ్ మొదలయ్యాక కూడా ఏ ఆర్టిస్టును ఖంగారు పెట్టరు. సీన్ బాగా ప్రాక్టీస్ చేయమని ఈయన క్రికెట్ ఆడుకుంటారు.
అంత ఫ్రీడం ఉంటుంది శేఖర్ కమ్ముల సెట్ లో. ఇక ఆయన కథలన్నీ పక్కా క్లీన్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగే ఉంటాయి. హీరో క్యారెక్టర్ కూడా సింపుల్ గా డీసెంట్ గా ఉంటుంది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చూసినా అదే తెలుస్తుంది. ఇంత డీసెంట్ గా సినిమాలు తీసే శేఖర్ కమ్ములలో రొమాంటిక్ యాంగిల్ మాత్రం బాగానే ఉంది. పైకి కనిపించరు గానీ హీరోయిన్స్ లో సెక్స్ అపీల్ అయిన బ్యాక్ స్పాట్ మీద బాగా ఫోకస్ చేస్తారు.
ఆనంద్ సినిమాలో కమిలినీ ముఖర్జీ బ్యాక్ ని చాలాసార్లు చూపించారు. అందరూ హీరోయిన్ ని రొమాంటిక్ గా చూపించాలంటే బొడ్డుపైన ఎద అందాల పైన ఫోకస్ చేస్తారు కానీ, శేఖర్ కమ్ముల మాత్రం హీరోయిన్ బ్యాక్ మీద ఫోకస్ చేస్తాడు. ఫిదా మూవీలో కూడా ఒక సీన్ లో సాయి పల్లవి బ్యాక్ మీద అలాగే కెమెరా పెట్టారు. శేఖర్ కమ్ముల మాదిరిగా ఈ రొమాంటిక్ స్పాట్ అంటే ఇస్టపడేవాళ్ళకి ఆ టేస్ట్ అర్థమవుతుంది.