ఈ మధ్యకాలంలో యాంకర్ సుమ బాగా ఓవర్ చేస్తుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మరి ముఖ్యంగా సుమ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతుంది . ఒకప్పుడు తన వాక్చాతుర్యంతో జనాలను ఆకట్టుకునే సుమ ఇప్పుడు డైలాగ్స్ తో పాటు పలు విధాలుగా హద్దులు మీరిపోయి మాట్లాడడం అభిమానులకు సైతం నచ్చడం లేదు .
రీసెంట్గాఓ ప్రీ రిలీజ్ఈవెంట్లో ఏకంగా మీడియా వాళ్ళను స్నాక్స్ ని భోజనంలా తింటున్నారు అంటూ టంగ్ స్లిప్ అయ్యింది. సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి కూడా గురైంది. తన కొడుకు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బీహేవ్ చేసిన పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా బబుల్గం . ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డ షోకి వస్తారు బబుల్గం మూవీ టీం అలాగే రాజీవ్ కనకాల . ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. కొడుకు కోసం బాగా కష్టపడ్డారని చెప్పాలి రాజీవ్-సుమ. అంతేకాదు కూసింత రొమాంటిక్ వేలో కూడా సుమా రాజీవ్ కనకాల ప్రవర్తించడం అభిమానులకి మింగుడు పడడం లేదు. ఇన్నాళ్లు చాలా పద్ధతిగా ఉన్నారుగా..? ఇప్పుడు కొడుకు సినీ ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారి పోవాలా అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు అది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం మీకెందుకురా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!