ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీలకు పెద్ద టఫ్ సిచువేషన్ ఎదురయిందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. నిన్న మొన్నటి వరకు ఓ పక్క సినిమాలు మరోపక్క చదువును సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న శ్రీ లీలకు ఇప్పుడు పెద్ద సవాల్ ఎదురైంది. శ్రీలీలకు లైవ్ సెషన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి .
అయితే ఇది ఎప్పటిలా రాత్రి చదివేసి ఉదయం పరీక్ష రాస్తే సరిపోదు . కచ్చితంగా శ్రీ లీల కాలేజ్ కి అటెండ్ అవ్వాలి . ఒకటి రెండు రోజులు కాదు దాదాపు నెల రోజులపాటు అమ్మడు ఈ పరీక్షలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది . అయితే శ్రీలీలకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదట . ముందు వెనక ఆలోచించకుండా అన్ని సినిమాలకు కమిట్ అయితే ఇలానే ఉంటుంది అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు .
మరికొందరు శ్రీలీల పొజిషన్ ని అర్థం చేసుకొని బాధ పడిపోతున్నారు . నిజానికి ఈ పరీక్షలు రెండు నెలలు తరువాత జరగాల్సింది.. కానీ కొన్ని కారణాల చేత త్వరగా ఈ పరీక్షలు పెడుతున్నారట. షూటింగ్స్ బంద్ చేసుకుని ఆమె పరిక్షలు రాయడం తప్పిస్తే తప్ప దీనికి పరిష్కారం కనిపించడం లేదు. చూద్దాం మరి ఈ ముద్దుగుమ్మ ఎలా ఈ టాప్ సిచువేషన్ నుంచి బయటపడుతుందో..?