కేవలం కొద్ది గంటలు అంటే కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది . మరికొద్ది గంటల్లో నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమాకి సంబంధించి కొందరు నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా థియేటర్స్ వద్ద నితిన్ అభిమానుల హంగామా మొదలైంది . భారీ కటౌట్లతో , ప్లెక్సీలతో ..రచ్చ రంబోలా చేస్తున్నారు.
అయితే నితిన్ యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . సినిమాలో కామెడీ కంటెంట్ తపిస్తే పెద్దగా మ్యాటర్ లేదు అంటూ కావాలనే ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు పలువురు హీరోల సినిమాలోని హిట్ డైలాగులు వాడుకొని ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు నితిన్ అంటూ ప్రచారం చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ అవ్వకముందే నెగటివ్ కామెంట్స్ దక్కించుకుంటుంది ఎక్స్ట్రాడినరీ మ్యాన్.
ఒకవేళ ఇది నిజంగానే నిజమైతే రేపు మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో..? అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు . కావాలనే ఇలా చేయడం న్యాయం కాదు అంటూ మండిపడుతున్నారు. మరికొందరు సినిమా హిట్ అని..వెధవలు ఎన్ని చెప్పినా..ఏం చేసిన మా నితిన్ సినిమాను ఏం పీకలేరు అని చెప్పుకొస్తున్నారు..!!