ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ చూస్తున్నాం. పాత సినిమాలకి సంబంధించిన సాంగ్స్ .. సీన్స్ ను.. డైలాగ్స్ ను కొత్త సినిమాలకు ఉపయోగించి క్రేజీ క్రేజీ హిట్స్ కొడుతున్నారు . అయితే అందరూ హీరోస్ కొడుతున్నారా ..? అంటే నో అని చెప్పాలి. కొంతమంది ఫ్లాప్ కూడా అవుతున్నారు. ఆలిస్ట్ లోకి వస్తుంది ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ .
భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా యావరేజ్ గా నిలిచింది . నితిన్ అభిమానులకు తప్పిస్తే పక్క హీరో అభిమానులకు ఎవరికి నచ్చలేదు . కామెడీ టైమింగ్ బాగుంది అంటూ కొంతమంది థియేటర్కు వెళ్లి చూసి నవ్వుకున్నారు . అయితే ఈ సినిమాలో డేంజర్ పిల్ల సాంగ్ తప్పిస్తే మరి ఏ పాట హిట్ అవ్వలేదు . కానీ ఈ సినిమాలో శ్రీ సత్య డాన్స్ చేసిన పాట మాత్రం అందరిని ఆకర్షించింది . చాలా వెరైటీగా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు .
అయితే ఈ పాటకి ఉన్న హిస్టరీ కారణంగా ప్రతి ఒక్కరు ఈ సాంగ్ గురించి చర్చించుకుంటున్నారు . “నా పెట్టె తాళం” అనే ఈ పాట చాలా ఏళ్ళ క్రితమే జానపద గీతం గా ప్రచారం పొందింది. ఆ తర్వాత క్రమక్రమంగా రికార్డింగ్ డాన్సుల్లో రావడంతో అది కాస్త అశీల పాటగా మారిపోయింది. అసలు ఈ పాటకి ఉన్న పాపులారిటీ చాలా తక్కువ మందికే తెలుసు . ఇండియాలో ఎయిడ్స్ విజృంభిస్తున్న సమయంలో దీనిని ఉపయోగించారట .
ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెనింగ్ లో ఈ పాటను వాడారట . ఆ తర్వాత ఈ పాట అశ్లీల నాట్యాలకు ఉపయోగించడంతో దీని రూపే మారిపోయింది . కేవలం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలోనే కాదు 2007లో వచ్చిన “మన్మధరావుల కోసం” అనే చిత్రంలో కూడా ఈ పాటను ఉపయోగించారు . అక్కడ కూడా ఈ పాట డుంకి కొట్టింది. అంతే కాదు ఈపాటికి డాన్స్ చేసే టైంలో శ్రీ సత్య చాలా టెన్షన్ పడిందట . తప్పుగా జనాల్లోకి వెళ్తుందా..? ఈ పాట అంటూ చాలా సార్లు ఆలోచించిందట. కానీ డైరెక్టర్ వక్కంతా వంశీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆమెకు నచ్చజెప్పి మరి ఈ పాటకు డాన్స్ చేయించారట . ఈ విషయాన్ని స్వయానా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం..!!