ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో టాప్ 10 లో కొన్ని సినిమాలు నిలవడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం. అలా 2023 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10లో నిలిచిన సినిమాల జాబితాను గూగుల్ బయటపెట్టింది. ఈ లిస్టులో ఏకంగా మూడు భారతీయ సినిమాలకు చోటుదక్కగా.. అందులో రెండు షారుక్ నటించిన సినిమాలు కావడం విశేషం.
షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. షారుక్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు గ్లోబల్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి. వీటిలో జవాన్ సినిమా మూడో స్థానంలో నిలవగా.. పఠాన్ సినిమా పదో స్థానంలో నిలిచింది. ఇక గదర్ 2 సినిమా ఎనిమిదవ స్థానం దక్కించుకుంది.
లిస్ట్‌లో మొదటి స్థానంలో బార్బీ మూవీ నిలిచింది. రెండో స్థానంలో ఓపెన్ హైమెర్ నిలవగా.. మూడో స్థానంలో జవాన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంచలన సృష్టించిన అవతార్ ది బే ఆఫ్ వాటర్ సినిమాకు టాప్ ఫైవ్ లో చోటు దాక్కకపోవడం ఆశ్చర్యకరం. ఈ సినిమా ఆరో స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. ఇక ఇండియాలో టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల విషయానికి వస్తే జవాన్, గదర్ 2, ఓపెన్ హైమర్, ఆది పురుష్, పఠాన్ సినిమాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
కేరళ స్టోరీ, జైలర్, లియో, టైగర్ 3, వారసుడు సినిమాలు ఆరు నుంచి పదవ స్థానాలు దక్కించుకున్నాయి. ఇక టాప్ టెన్ ట్రెండింగ్ మూవీస్ విషయానికి వస్తే చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమా ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా కావటం విశేషం. దీనిని బట్టి ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో రోజురోజుకు పెరుగుతుందో తెలుస్తోంది. ఏదేమైనా రోజు రోజుకు భారతీయ సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా ఎదుగుతోంది.