తెలుగులో నలుగురు స్టార్స్ కలిసి చేసిన సినిమా టెంపర్. పూరి జగన్నాధ్ స్టార్ డైరెక్టర్, బండ్ల గణేశ్ స్టార్ ప్రొడ్యూసర్, ఎన్.టి.ఆర్ స్టార్ హీరో, వక్కంతం వంశీ స్టార్ రైటర్. వీరి నుంచి వచ్చిందే టెంపర్. ఎప్పుడో ఢిల్లిలో జరిగిన నిర్భయ హత్యని ఆధారంగా చేసుకొని అద్భుతమైన కథ రాసుకున్నారు వక్కంతం వంశీ. అప్పటికే, రచయితగా సక్సెస్ లు చూశారు.
ఎన్.టి.ఆర్ తో మంచి బాండింగ్ ఉంది. ఆ రకంగా టెంపర్ కథను తారక్ తో చెప్పి ఉన్నాడు. కానీ, ఎందుకో అది హోల్డ్ లో ఉంది. అదే సమయంతో తారక్, పూరి జగన్నాధ్ కాంబోలో బడ్ల గణేశ్ సినిమా నిర్మించాలని అనుకున్నారు. కానీ, కథ సెట్ కాలేదు. సాధారణంగా పూరి సినిమాలన్నిటికీ ఆయనే కథ రాసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.’
కానీ, టెంపర్ కథ తారక్ పూరికి చెప్పమని వక్కంతం వంశీతో చెప్పారు. అలాగే చెప్పగా పూరికి విపరీతంగా నచ్చింది. భారీ స్థాయిలో సినిమా మొదలై సూపర్ హిట్ సాధించింది. కానీ, కథ ఇచ్చిన వక్కంతం వంశీకి మాత్రం బండ్ల గణేశ్ మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అడగగా అడగగా చెక్ ఇచ్చారట. అది కాస్తా బౌన్స్ అయింది.
దాంతో వక్కంతం వంశీ తప్పని పరిస్థితుల్లో బండ్ల గణేశ్ మీద చెక్ బౌన్స్ కేసు వేయాల్సి వచ్చింది. అప్పట్లో ఈ ఇష్యూ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది. టెంపర్ కి పనిచేసిన అందరూ ఫేం ఉన్నవాళ్ళే. కానీ, ఈ విషయం వల్ల కాస్త డిస్టబెన్సెస్ క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాత అన్నీ కుదుటపడి సెట్ అయ్యాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బండ్ల గణేశ్, వక్కంతం వంశీ ఇద్దరూ మంచి స్నేహితులు.