భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని గ్రౌండ్లో బ్యాట్ పట్టి ఎలా సిక్స్‌లు ? బాదుతాడో.. బయట అంతే రొమాంటిక్‌గా ఉంటాడని తెలిసింది. ధోని తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్‌ను 2010లో వివాహం చేసుకున్నాడు. అంతకంటే ముందే అతడిపై పలు డేటింగ్ రూమర్లు వచ్చాయి. పలువురు స్టార్ క్రేజీ హీరోయిన్లతో ధోని డేటింగ్ చేశాడు.
దీపిక పదుకొనే :
బాలీవుడ్లో అడుగుపెడుతూనే.. సంచలనంగా మారిన దీపిక పదుకొనేపై ధోని మనసు పారేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి కొన్నాళ్లు చెట్టాపట్టలేసుకొని తిరిగారు. అదే సమయంలో యువరాజ్ సింగ్ కూడా చైన్‌లోకి ఎంట్రీ ఇచ్చి దీపికను తన వైపుకు తిప్పుకోవడంతో ధోని పక్కకు తప్పుకున్నాడని ప్రచారం జరిగింది.
ప్రితీ సిమోస్ :
ప్రితీ సీమోస్ ది కపిల్ షో ప్రోగ్రామ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రితి సీమోస్తో కూడా ధోని సీక్రెట్‌గా డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రితి.. ధోని అంటే తనకు ఎంతో ఇష్టమని ఓపెన్ గా చెప్పింది. అయితే ధోని మాత్రం ప్రితీ చేసిన కామెంట్ పై నోరు మెదపలేదు.
లక్ష్మీరాయ్ :
ఇక టాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు, ఐటం సాంగ్‌లతో పాపులర్ అయిన రాయ్ లక్ష్మి అలియాస్ లక్ష్మీరాయ్ తో కూడా ధోని ఎఫైర్ నడిపాడన్న ప్రచారం గట్టిగా నడిచింది. ధోని కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్ష్మీరాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ఆ టైంలో మూడేళ్ల పాటు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. వీరిద్దరూ ఒకే రూమ్‌లో కలిసి ఉండే వారిని అంటారు.
ఆశిన్ :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆశిన్. ధోని ఈమెతో కూడా ప్రేమాయణం కొనసాగించారు. ఈ భామను ధోని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధల నేపథ్యంలో బ్రేకప్ జరిగింది. రాహుల్ శర్మను పెళ్లాడి ఈ రూమర్లకు చెక్ పెట్టేసింది.