టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నిర్మాత సురేష్ దగ్గుబాటి సురేష్‌బాబు చిన్న కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి తమ్ముడైన అభిరామ్ దగ్గుబాటి ఈ డిసెంబర్లోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అవుతోన్న సంగతి తెలిసిందే. అభిరామ్ ఇప్పటికే తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది.
ఇక టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం ప్రకారం అభిరామ్ వివాహం డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని సుందరమైన ఫైవ్‌స్టార్ రిసార్ట్ అయిన అనంతర కలుతారాలో ప్రత్యూష చాపరాలతో అభిరామ్ వివాహం గ్రాండ్‌గా జరగనుంది. ఇక దగ్గుబాటి కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరుగుతుందని.. మొత్తం 200 మంది మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
ఈ పెళ్లికి వెళ్లే అతిథులు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టనున్నారు. కాగా మూడు రోజుల వివాహ వేడుకలు సోమవారం (డిసెంబర్ 4) రాత్రి గ్రాండ్ డిన్నర్ పార్టీతో మొదలు కానున్నాయి. ఇక మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మొహందీ వేడుక అనంతరం విందు కూడా అక్కడే ఉంటుంది. ఇక బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లికూతురు వేడుక తర్వాత సాయంత్రం 7 గంటలకు వివాహ వేడుక స్టార్ట్ అవుతుంది.
రాత్రి 8.50 గంటలకు సుముహూర్తం తర్వాత అందరూ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఇక్కడ గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో అడుగు పెట్టే కోడలు ప్రత్యూష చాపరాల సురేష్‌బాబు కుటుంబానికి బంధువే. వారిది ప్రకాశం జిల్లాలోని కారంచేడు అని తెలుస్తోంది. ప్రత్యూష సురేష్‌బాబుకు వరుసకు మేనకోడలు అవుతుందట. వారికి కుటుంబానికి భారీగా వ్యాపారాలతో పాటు ఆస్తులు ఉన్నాయట.