సీనియర్ నటుడు కైకాల సత్య నారాయణ నిర్మాణంలో భాగస్వామిగా ఉండి నిర్మించిన సినిమా కొదమ సింహం. ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ అనే సినిమా చేసి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. విజయశాంతి, రాధ హీరోయిన్స్. యండమూరి వీరేంద్ర నాథ్ స్క్రీన్ ప్లేని, పరుచూరి బ్రదర్స్ కథని అందించారు.
భారీ లాభాలను అర్జించిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది. ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు. అయితే, ఈ సినిమా కి సమాంతరంగా కౌబాయ్ పాత్రలో చిరంజీవి కొదమ సింహం సినిమాలో నటించారు. దీనికి కె మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్స్ గా విజయశాంతి, రాధ నటించాల్సింది. వాణి విశ్వనాథ్ రాధ పోషించిన పాత్రలో కనిపించాల్సింది.
అప్పట్లో విజయశాంతి చాలా బిజీ. దాంతో మేయిన్ హీరోయిన్ గా అనుకున్న విజయశాంతి ప్లేస్ లో సోనం అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. రాధ చేయాల్సిన పాత్రను వాణి విశ్వనాథ్, ఆమె చేయాల్సిన పాత్రను రాధతో చేయించారు. అదే సినిమాకి పెద్ద మైనస్ అయింది. హీరోయిన్లు తారుమారవడం వల్ల అనుకున్న క్యారెక్టర్స్ స్క్రీన్ మీద ఆకట్టుకోలేకపోయాయి.
ముఖ్యంగా సోనం ని చిరంజీవి పక్కన మేయిన్ హీరోయిన్ గా చూడలేకపోయారు. రాజ్ కోటి మంచి సాంగ్స్ అందించారు. కైకాల నిర్మాణంలో భాగస్వామీ అయి నష్టాలను చూశారు. చిరంజీవి కౌబాయ్ పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ అప్పట్లో ఉన్న ఆడియన్స్ మెంటాలిటీకి సినిమా ఎక్కలేదు. దాంతో కథ కంటే కూడా హీరోయిన్ మైనస్ అయి ఆమె మీద ఫ్లాప్ ముద్రను తోసేశారు.