మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ల మధ్య ఎంతటి అనుబంధం ఉందో చాలా మందికి తెలీదు. రాజా అని చిరంజీవి పిలిస్తే ప్రసాదు అని రాజేంద్ర ప్రసాద్ పిలుస్తారు. అదీ వాళ్ల మధ్య ఉన్న బంధం. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకునేంత స్పెషల్ బాండింగ్ ఉంది. డాడీ, హిట్లర్ సినిమాలలో వీరి క్యారెక్టర్స్ చూస్తే కొంత వరకూ ఓ ఐడియా వస్తుంది.
అంత బలమైన బంధం ఉన్న రాజేంద్ర ప్రసాద్ తో చిరంజీవి కూతురు ఓ మాట అడగడానికి ఇంటికెళ్ళి మొహమాటపడిందట. సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేశారు. కానీ, ఎప్పుడూ ఏ సినిమాకి రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదు. అది ఆయనలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్.
ఇక త్రివిక్రం శ్రీనివాస్ లాంటి వారితో మంచి బాండింగ్ ఉంది. సినిమా కమిటయ్యాక కనీసం ఒక్క షాట్ అయినా తీసి పంపమని అడుగుతారట. అందుకే, చిరంజీవి కూతురు సుశ్మిత పవన్ సాదినేని దర్శకత్వంలో సేనాపతి అనే సినిమాని నిర్మించింది. ఓటీటీ కోసం నిర్మించిన సినిమా ఇది. ఇందులో మేయిన్ లీడ్ కి రాజేంద్ర ప్రసాద్ అయితే బావుంటుందని అడగడానికి వెళ్ళి అడగలేకపోయిందట.
ఏంటమ్మా ఏమన్నా చెప్పాలా..ఏంటీ అని అడిగితే మీరు ఓటీటీ కోసం ఒక సినిమా చేయాలి..నేనే నిర్మాత అన్నదట. ఓటీటీలో నన్ను చూస్తారా..? అంటే లేదు మీరే చేయాలి. డైరెక్టర్ పవన్ సాదినేని సినిమా పేరు సేనాపతి అని చెప్పిందట. కట్ చేస్తే ఆ సినిమాలో నటించినందుకు గానూ రాజేంద్ర ప్రసాద్ కి పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా ముంబై వాళ్ళు ఫంక్షన్ చేసి అవార్డ్ ఇచ్చారు. అదీ లెక్క. అందుకే, వెతుక్కుంటూ సుశ్మిత రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళింది.