సినిమా ఇండస్ట్రీలో హీరో అన్నాక చాలా తలనొప్పులు ఉంటాయి. పైకి కనిపించినంత సాదాసీదాగా కూల్ గా లైఫ్ సాగిపోతూ ఉండడు. తెరవెనక ఎన్నో కష్టాలు పడతారు . మన మెగాస్టార్ చిరంజీవి కూడా అలాంటి కష్టాలు ఎన్నో పడి భరించి ఈ స్థాయికి వచ్చారు . అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో ఓ సీన్ ని మనసు చంపుకొని ఇష్టం లేకపోయినా చేశారట. ఆ సినిమా మరేదో కాదు ఘరానా మొగుడు .
రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి – నగ్మా ఓ రేంజ్ లో రెచ్చిపోయినటించారు . అప్పటి వరకు చాలా డీసెంట్ గా ఉన్న చిరంజీవికి ఈ సినిమా నాటి హీరో అంటూ బిరుదు తెచ్చేలా చేసింది. మరి ముఖ్యంగా వీళ్ళ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే కెవ్వు కేక అనే చెప్పాలి . కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలోని ఫస్ట్ టైం ఓ హీరోయిన్ కి లిప్ కిస్ ఇచ్చారు .
హీరోయిన్ నగ్మా తో ఈ సినిమాలో ఓ పాటలో లిప్ కిస్ సీన్లు డిజైన్ చేశారు రాఘవేంద్రరావు . అయితే ఈ సీన్ ఆయనకు ఇష్టం లేకుండానే చిరంజీవి నటించాడు అన్న వార్త అప్పట్లో ఎక్కువగా వినిపించింది . అసలు అలాంటి సీన్ చేయకూడదు అని డిసైడ్ అయిన చిరంజీవి చేత డైరెక్ట్ గానే రాఘవేంద్రరావు లిప్ లాక్ చేయించడం అప్పట్లో సంచలనంగా మారింది .
అయితే మనసు చంపుకొని అలా నటించినా.. సరే ఆ సీన్ ఎడిట్ చేసేటప్పుడు చిరంజీవి వెళ్లి దయచేసి ఆ సీన్ తొలగించండి అంటూ చాలా రిక్వెస్ట్ చేశారట . అలా చిరంజీవి ఈ సినిమాలో తనకు ఇష్టం లేకుండానే లిప్ లాక్ చేసిన పరిస్థితి ఏర్పడింది..!!