పాపం .. తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్న రేంజ్ లో నిహారిక కొణిదెలా ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న న్యూస్ మెగా డాటర్ డివర్స్ . శ్రీజ విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక డివర్స్ అంతస్థాయిలో వైరల్ అయింది . మరీ ముఖ్యంగా నిహారిక పెళ్లి టైంలో చేసిన హంగామా చూసిన జనాలు వీళ్ళు ఏడేడు జన్మలు కలిసి ఉంటారు అంటూ ఫిక్స్ అయిపోయారు.
ఏడు జన్మలు కాదు కదా ఏడు సంవత్సరాలు కూడా ఉండకుండా ఒక సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. అయితే వీళ్ళు విడాకుల తర్వాత చాలా దూరంగా ఉన్నారు. ఒకరికి సంబంధించిన విషయాలు మరొకరు పట్టించుకోలేదు. రీసెంట్గా సోషల్ మీడియాలో జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి వార్త ట్రెండ్ అవుతుంది. జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట .
అది కూడా నిహారిక ఫ్రెండ్ లలో ఒకరైన బిజినెస్ మ్యాన్ కూతురుని అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగా డాటర్ కాకపోతే మిగతా డాటర్లు రారా అన్న రేంజ్ లో చైతన్య తన రెండో పెళ్లి ని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!