కొంతమంది హీరోయిన్స్ వస్తున్న సక్సెస్ ని సరిగ్గా ఉపయోగించుకోలేక అద్భుతమైన భవిష్యత్ ఉన్నా కూడా దిగాలుగా కూర్చొని దేబిరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కేథరీన్ థ్రెసా గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. హీరోయిన్స్ అన్న తర్వాత కాస్తో కూస్తో హెడ్ వైట్ ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ సెట్ లో యూనిట్ వారిని పురుగులుగా చూస్తుంటారు. కాని, కేథరీన్ అలాంటి టైప్ కాదు. అనుపమ పరమేశ్వరన్, అనుష్క శెట్టి, సమంత ..వీరందరూ ఆఫీస్ బాయ్ కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు.
కేథరీన్ కూడా యూనిట్ సభ్యులందరినీ చాలా గౌరవిస్తుంది. ఇక దర్శకనిర్మాతలను ఎంత గౌరవిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ హీరో దునియా విజయ్ సరసన శంకర్ ఐపిఎస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేథరీన్. అదే సంవత్సరం పృథ్వీరాజ్ సరసన మలయాళంలో ది ధ్రిల్లర్ సినిమాలో, కన్నడ భాషలో ఉప్పుకుండం బ్రదర్స్, విష్ణు సినిమాలలో నటించింది.
ఆ తర్వాత 2012లో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది కేథరీన్. దాంతో టాలీవుడ్ మేకర్స్ దృష్టి పడింది. ఆరకంగా 2013లో కేథరీన్ వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాపైనా కేథరీన్ కు అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇందులో అమలా పాల్ కంటే తనే బాగా నటించిందని చెప్పుకున్నారు.
కానీ, ఆ పేరును ఉపయోగించుకోవడంలో కేథరీన్ రాంగ్ స్టెప్స్ వేసింది. హీరోయిన్ గా సినిమాలను ఎంచుకోవాల్సింది పోయి..సెకండ్ లీడ్ అవి కూడా కెరీర్ కి పనికిరాని సినిమాలను ఒప్పుకొని తన కెరీర్ ని తానే ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంది. విచిత్రం ఏమిటంటే కేథరీన్ సెకండ్ లీడ్ గా నటించిన సినిమాలలో స్టార్ హీరోయిన్స్ నటించారు. ఆ సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. కానీ, అవే సినిమాలు కేథరీన్ కెరీర్ కి మాత్రం సహకరించలేదు.