ఈ యేడాది టాలీవుడ్ సినీ జనాలు ఎక్కువుగా చర్చించుకున్నది ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీ క్రేజీ హీరోలు రామ్‌చరణ్, బన్నీ మధ్య గొడవలు, విబేధాల గురించే. గత కొన్నేళ్లుగా వీరి మధ్య అంత సఖ్యత, సానుకూల వాతావరణం అయితే ఉన్నట్టు కనపడడం లేదు. సోషల్ మీడియాలో ఇతర హీరోల గురించి ఈ ఇద్దరు హీరోలు పెట్టే కామెంట్స్ హత్తుకునేలా ఉంటే వీరిద్దరి గురించి వీళ్లు పెట్టుకునే కామెంట్లు ముక్తసరిగా, అయిష్టంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం, ఇటు పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడం.. పైగా బన్నీకి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు రావడంతో వీరి మధ్య ఉన్న గ్యాప్ మరింత పెరిగిందన్న ప్రచారం గట్టిగా నడిచింది. ఆర్ ఆర్ ఆస్కారు అవార్డు టైంలో బన్నీ ప్రత్యేకంగా చరణ్‌ను అభినందించలేదని అన్నారు. బన్నీకి జాతీయ అవార్డు వచ్చినప్పుడు చరణ్ ప్రత్యేకంగా అభినందించకుండా గుంపులో కలిపేస్తూ ట్వీట్ వేశాడని అల్లు ఆర్మీ ట్వీట్ వేసింది.
అలా చరన్, బన్నీ మధ్య గ్యాప్‌పై రకరకాల ప్రచారం నడిచింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి కనిపించ లేదు కూడా..! ఇక మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ వీరు కలిసి కనపడలేదు. వరుణ్ తేజ్ పెళ్లికి ఇద్దరూ వచ్చినా.. ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో లేరు. అయితే ఎట్టకేలకు చరన్, బన్నీ కలిసి ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్ సంబరాలు జరుపుకుంది.
ఈ సంబరాల్లో దిగిన గ్రూప్ ఫొటోలో బన్నీ, చరణ్ కలిసి పక్క పక్కనే ఉన్నారు. దీంతో వీరి మధ్య వైరం పోయిందా ? అని కొందరు అంటున్నా… వృత్తిపరమైన పోటీతో పాటు కెరీర్ పరంగా ఆధిపత్యం కోసం మొదలైన ఈ వార్‌కు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడదని కొందరు అంటున్నారు.