నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఎంతో ఆప్యాయత అనురాగంతో ఉంటారు. ముఖ్యంగా వీరి పెద్ద సోదరుడు నందమూరి జానకిరామ్ మృతి తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా అనేక సినిమాలు తీసి ఇబ్బందులు పడడంతో.. ఎన్టీఆర్ తక్కువ బడ్జెట్లో జై లవకుశ సినిమా తీసి కళ్యాణ్‌రామ్ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేలా చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలలో కూడా కళ్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఈనెల 29న థియేటర్లోకి వస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో కళ్యాణ్ రామ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నాది మాత్రమే కాదు.. తమ్ముడు ఎన్టీఆర్‌ది కూడా. ఆ బ్యానర్ పై తాను సినిమా చేస్తున్నప్పుడు పర్యవేక్షకుడిగా మాత్రమే ఉంటాను.. కేవలం సపోర్ట్‌గా ఉంటాను.. తమ్ముడు ఏం చేస్తాడో నాకు తెలుసు.. ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే ఉంటాను. ఊరికే వేలుపెట్టి కెలకటం నాకు ఇష్టం ఉండదు.. తమ్ముడు రేంజ్ ఏంటో అందరికీ తెలుసు.. అతడు చిన్నపిల్లాడు కాదు మధ్యలోకి వెళ్లి.. నేను పుల్లలు పెట్టను అని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశాడు.
సినిమాల వరకు మాత్రమే కాదని నిజజీవితంలో కూడా తమ బంధం అలాగే కొనసాగుతుందని చెప్పారు కళ్యాణ్ రామ్. సినిమా చూసి తనకు నచ్చితేనే ట్వీట్ చేస్తారు.. నేను అడగను. డెవిల్ ట్రైలర్ చూశారు.. మార్పులు చెప్పారు చేశాం. ట్వీట్ వెయ్యలా వద్దా అనేది ఆయన ఇష్టం. ఓ ట్వీట్ వేయడం, ఓ ఈవెంట్‌కు రావటం అనేది మా మధ్య బంధానికి కొలమానం అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. మేమిద్దరం జీవితాంతం అన్నదమ్ములం.. దీనిని ఎవరు మార్చలేరు.. ఆ బంధాన్ని ట్వీట్ ద్వారా కొలుస్తామంటే నాకు నవ్వు వస్తుందని కళ్యాణ్ రామ్ చెప్పారు.