ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోట్ అవ్వాలి అంటే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఎక్కువగా చేయాలి అన్న స్ట్రాటజీలకన్నా చేసిన రెండు మూడు అయినా సరే కూసింత ఘాటు లెవెల్ లో చేస్తే కచ్చితంగా సినిమా ప్రమోట్ అవుతుంది అన్న ఫీలింగ్ అభిమానులకి కలగజేసేలా చేస్తున్నారు కొందరి హీరోలు. స్టార్ హీరోలు అని చెప్పలేము కానీ టైర్ 2 ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న హీరోలు అయితే అదే స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారు .
రీసెంట్ గా సుమ కొడుకు రోషన్ కనకాల చేసిన పనికి అభిమానులు షాక్ అయిపోతున్నారు . డిసెంబర్ 29న రోషన్ కనకాల నటించిన బబుల్గం సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్ . ఈ ఫంక్షన్ కి అడవి శేష్ – సిద్దు జొన్నలగడ్డ చీఫ్ గెస్ట్ గా వచ్చారు . అంతేకాదు రోషన్ కు సపోర్టు కూడా అందించారు . అంతేకాకుండా డైరెక్టర్ నందిని కూడా ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
అయితే స్టేజ్ పైకి వచ్చిన రోషన్ కనకాల చాలా అగ్రిసివ్ గా మాట్లాడారు . నిజానికి ఫస్ట్ హీరో ఈ విధంగా మాట్లాడడం చాలా చాలా గ్రేట్ అయితే కొంతమంది మాత్రం మొదటి సినిమాకే ఇంత తలపోగరా అంటూ తిడుతున్నారు. స్టేజ్ పైకి వచ్చిన రోషన్ కనకాల మాట్లాడుతూ ..”నన్ను చాలామంది నల్లగా -కర్రెగా ఉన్నాడు.. వీడేంటి హీరో అంటూ ఎగతాళి చేశారు . నాది హీరో మెటీరియలే కాదన్నారు. ఇంకా ఎన్నెన్నో బూతులు తిట్టారు. బ్రదర్స్ అందరికీ ఒకటే చెబుతున్నా తెలుపు నలుపు అనేది మనల్ని డిసైడ్ చేయదు ..మన సక్సెస్ మన దగ్గరికి రావాలి అంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ “.
“అందరు హీరోలు తెల్లతోలు వేసుకొని ఉండలేరుగా అందరూ ఒకే స్టార్ డం దక్కించుకోలేరు ..మనకు ఇది కావాలి అనుకున్నప్పుడు కష్టపడాలి అది నేను చేస్తున్నాను ..ఎవరేమైనా అనుకోండి బరాబర్ నేను సినిమాలు చేస్తా .. ఇలాగే మాట్లాడుతా అంటూ ఓవర్ అగ్రిసివ్ నెస్ తో మాట్లాడారు”. స్టేజిపై ఉన్న ప్రముఖులతో పాటు స్టేజ్ కింద ఉన్న జనాలు సైతం షాక్ అయిపోయారు .
అయితే సుమ ఫాన్స్ మాత్రం రోషన్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. ” వాడి ఇష్టం వాడికి నచ్చింది చేసుకుంటాడు.. మధ్యలో మీకేంటి రా ప్రాబ్లమ్స్.. వాడు కోరుకుంటాడో.. ముద్దు పెట్టుకుంటాడో.. మీకెందుకురా..? ట్రోల్ చేసే వెధవల్లారా.. సక్సెస్ కొట్టండి అప్పుడు తెలుస్తుంది.. మీకు ఆ బాధ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు”..!