నందమూరి నరసింహ బాలకృష్ణ ఈ దసరాకు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ యేడాది సంక్రాంతి వీరసింహారెడ్డి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో వరుసగా మూడో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అలాగే టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటించగా తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
ఇప్పటికే ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ చేసుకుంది. మొత్తం 15 కేంద్రాలలో అర్థశత దినోత్సవ జరుపుకున్న భగవంత్ కేసరి డైరెక్ట్ గా 11 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో ఉత్తరాంధ్రలో గాజువాక, పశ్చిమగోదావరిలో ఏలూరు, తెలంగాణలో ఖమ్మం మినహా మిగిలిన కేంద్రాలు అన్ని బాలయ్య కంచుకోట అయిన సీడెడ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో ? తెలుసుకుందాం.
భగవంత్ కేసరి సినిమాకు నైజాం ఏరియాలో రు 19.05 కోట్లు – సీడెడ్‌లో 14.45 కోట్లు – ఉత్తరాంధ్రలో 6.74 కోట్లు – ఈస్ట్‌లో 3.40 కోట్లు – వెస్ట్‌లో 2.90 కోట్లు – గుంటూరు 5.85 కోట్లు – కృష్ణ 3.50 కోట్లు – నెల్లూరు 2.58 కోట్లు.. ఓవరాల్‌గా ఏపీ, తెలంగాణలో 100 కోట్ల గ్రాస్ రు. 58.47 కోట్ల షేర్ రాబట్టింది. ఇక కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రు. 6 కోట్లు, ఓవర్సీస్‌లో 7.35 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. రు. 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసేసరికి నాలుగు కోట్ల లాభాలను అందుకుని క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది. బాలయ్య నటించిన చివరి మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్లు కొట్టడంతో పాటు మూడు సినిమాలతోనూ నిర్మాతలు… సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు అందరూ భారీ లాభాలు కళ్ళు చూసారు. నిజంగా ఇది బాలయ్య అభిమానులు అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పుకుని న్యూస్ అని చెప్పాలి.